అంతరిక్ష ప్రయేగాల్లో దూసుకుపోతున్న భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయేగానికి సిద్దమైంది. ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-9 రాకెట్ ద్వారా శుక్రవారం సాయంత్రం 4.57 గంటలకు శ్రీహరికోట ప్రయోగకేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌తో ప్రయోగిస్తున్న రాకెట్ల శ్రేణిలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-9 నాల్గవది.దక్షిణాసియా సభ్యుదేశాలకు సాంకేతికపరిజ్ణానం అందించడం కోసం ఈఉప గ్రహాన్ని భారత్ ప్రయేగించనున్నారు.
2014లో తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) కూటమి ప్రభుత్వాధినేతలను ఆహ్వానించి, స్నేహరీతిని చాటుకున్న ఆయన.. ఆ తర్వాత మరో ముందడుగు వేసి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ఉపగ్రహాన్ని కానుకగా ప్రకటించారు. శాంతి, అభివృద్ధి కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞంపై నీళ్లు కుమ్మరించేందుకు పాకిస్థాన్ యథాశక్తి ప్రయత్నించినా.. భారత మొక్కవోని దీక్ష ముందు ఆ పన్నాగాలు ఫలించలేదు.మోదీ విదేశాంగ విధానంలో ఇది ముఖ్యమైనది.
పొరుగు దేశాల్లో కమ్యూనికేషన్లు, ప్రసారాలు, విపత్తు నిర్వహణ, వాతావరణ హెచ్చరికలకు ఉపయోగపడే ఈ ఉపగ్రహ తయారీకి, ప్రయోగానికి అయ్యే ఖర్చులన్నింటినీ భారతే భరిస్తుంది. దీని సేవలను వినియోగించుకోవడం కోసం ప్రతి దేశమూ సొంతంగా భూ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు భారత్ సాంకేతిక తోడ్పాటు అందిస్తుంది.పొరుగు దేశాలకు ఉచితంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇచ్చిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేవు. ప్రస్తుతమున్న అన్ని ప్రాంతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహాలన్నీ లాభార్జన కోసం చేపట్టినవే.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-9 రాకెట్ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్ర హంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.దక్షిణాసియాలో దేశాల మధ్య సమాచార మార్పిడి, విపత్తుల నిర్వహణలోనూ ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
Related
