Thursday, May 16, 2024
- Advertisement -

అఖిల్ నమ్మి నాగ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?

- Advertisement -
Nag Doing Same Mistake

అక్కినేని అఖిల్ మొదటి మూవీ ‘అఖిల్’..  పాతిక కోట్లకు పైనే షేర్ రాబట్టింది. ఓ కొత్త హీరో మొదటి సినిమాకి ఈ రెంజ్ లో వసూళ్లు రావడం గొప్ప విషయమే. కానీ.. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడం వల్ల.. భారీ రేట్లకు అమ్మడం వల్ల సినిమా ‘డిజాస్టర్’ అనే అనిపించుకుంది. అఖిల్ అరంగేట్రంపై వచ్చిన హైప్ చూసుకుని నితిన్ బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకోలేదు. అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరిగాయి.

ఐతే ‘అఖిల్’ దెబ్బకు అఖిల్ నేల మీదకు వచ్చేశాడు. ఇప్పుడు అతడి మీద మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. ఐతే అక్కినేని నాగార్జున మాత్రం కొడుకు విషయంలో వెనక్కి తగ్గట్లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే రెండో సినిమాకు  రూ.40 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్టయిల్లో సాగుతుందట. విక్రమ్.. అఖిల్‌తో చేయబోయే యాక్షన్ ఎంటర్టైనర్‌ను కూడా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించాలని భావిస్తున్నాడు.

తన ఫ్యామిలీకి ‘మనం’ లాంటి మరపురాని సినిమాను అందించిన విక్రమ్ మీద నమ్మకంతో నాగ్.. అఖిల్ సినిమా కోసం ఏమడిగితే అది సమకూరుస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో యాక్షన్ పార్ట్‌కే సగం బడ్జెట్ అయిపోతుందట. అందుకోసం హాలీవుడ్ నిపుణుల్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఐతే ‘అఖిల్’ అనుభవం నేపథ్యంలో బయ్యర్లు ఈ సినిమాను బడ్జెట్‌కు తగ్గట్లుగా కొనడానికి ముందుకొస్తారా అన్నది సందేహం. మరి నాగ్ చేస్తున్న రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఏప్రిల్ 1న ఈ చిత్రం పట్టాలెక్కనుంది. 

Related

  1. అఖిల్ కి మళ్లీ స్టార్ట్ అయిన కొత్త తలనొప్పి..
  2. అఖిల్ పెళ్లి క్యాన్సిల్ త‌ర్వాత నాగ్ మొదటి రిప్లే
  3. అఖిల్, శ్రీయాలను కలిపేందుకు.. రంగం లోకి దిగిన ఉపాసన
  4. అఖిల్ పెళ్లి క్యాన్సిల్‌కు అసకు కారణం ఇదే.. బయటపడ్డ నిజాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -