Friday, May 9, 2025
- Advertisement -

ఫ్యాన్స్ కి నాగబాబు మళ్లీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు!

- Advertisement -
nagababu sweet warning

బయటకు కనిపించడంలేదు కాని లోలోపల మెగా అండ్ నందమూరి మధ్య కోల్డ్ వార్ ఓ రెంజ్ లో జరుగుతోంది. ఇద్దరు దిగ్గజాలు సంక్రాంతికి రావడంతో ఫాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ పుణ్యమా అని ఒక్క మాట అన్నా చాలు ప్రపంచంలో ఏ మూలనున్నా సెకండ్స్ లో తెలుసుకునే అవకాశం దక్కింది. దీనికి తోడు ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి ట్రాల్ చేయడం ఫాషన్ గా మారిపొయింది. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బ్రహ్మోత్సవం టైం లో ఇది ముదిరి ఏవగింపు కలిగే వరకు వచ్చింది.

తమ సినిమానే బెస్ట్, మిగిలినవన్నీ వేస్ట్ అనుకునే వైపరిత్య ధోరణి బాగా పెరిగిపోతోంది. ఆ మధ్య ఫాన్స్ మధ్యే వైషమ్యాల వల్లే బెంగుళూరు దగ్గరలో ఓ స్టార్ హీరో ఫాన్స్ ని మరో హీరో అభిమాని ఏకంగా కత్తితో పొడిచి హత్య చేసాడు. ఇప్పుడు మళ్ళి అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండటంతో నాగబాబు ఫీల్డ్ లోకి వచ్చాడు. మన సినిమానే బాగుండాలి, పక్క సినిమా మాత్రం ఘోరంగా దెబ్బ తినాలి అనుకునే సంస్కృతి ఎంత మాత్రం మంచిది కాదని నాగబాబు హెచ్చరిస్తున్నారు.

సినిమా అనేది కొన్ని వందల వేల లక్షల కుటుంబాలను పోషించేది అని, దాన్ని తమ స్వార్థం కోసం పోటీ సినిమా ఆడకూడదు అనే ధోరణి ఇండస్ట్రీ కి ఏ మాత్రం మంచిది కాదనే మెసేజ్ ఇచ్చాడు. నేరుగా సినిమాల పేర్లను కూడా ప్రస్తావించి మూడు సినిమాలు విజయం సాధించాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు. ఇక అన్నయ్య మళ్ళి సినిమాల్లోకి తిరిగి రావడం పట్ల మొట్టమొదటగా సంతోషించే అభిమాని తానే అని ఎన్నో సార్లు చెప్పానని, అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఖైది నంబర్ 150 ఉంటుందని హామీ ఇచ్చేసాడు. కాని సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అన్ని చిత్రాలు హిట్ అయితేనే పరిశ్రమ బాగుటుందని.. కాబట్టి ఫ్యాన్స్ సినిమాలపై దుష్ప్రచారాన్ని చేయకుడదని అన్నారు.

Related

  1. షాక్ లో ఉన్న నాగబాబు!
  2. సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చిన నాగబాబు!
  3. నాగబాబు కు ఎక్కడా లేని కోపం వచ్చిందట!
  4. నిహారిక ప్రశ్నకు షాక్ అయిన నాగబాబు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -