సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాలా భామ నయనతార. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో కంటే తమిళంలో వరస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే నయనతార ప్రభుదేవాతో విడిపోయాక.. కొంత కాలం ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉండాలేక తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కొత్త ప్రేమ వ్యవహారం స్టార్ట్ చేసింది. వీరిద్దరిపై తమిళ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉంటున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.
తాజా వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. నయనతారవిఘ్నేష్ శివన్ ఆరు నెలల క్రితమే సీక్రెట్ గా చేసుకున్నారట. మే నెలలోనే వీరి పెళ్లి జరిగిందని, గతంలో ప్రేమ, వివాహం విషయాల్లో నయనతార చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్న క్రమంలో మీడియాకు ఛాన్స్ ఇవ్వకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. పెళ్లయినప్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉంటున్నారని, విఘ్నేష్ శివన్ టాప్ డైరెక్టర్ గా ఎదిగేందుకు… స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చేలా నయనతార తనవంతు సహకారం చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నయనతార టాప్ హీరోయిన్ గా కొనసాగుతుండటంతో.. కెరీర్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ కాకుడదని.. పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచారని టాక్ వినిపిస్తోంది.
ఇక కేరళకు చెందిన నయనతార.. రీసెంట్ గా ఓనం పండుగను విఘ్నేష్ శివన్ తనే కలిసి రహస్యంగా చేసుకుంది. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పెళ్లి అయ్యింది కాబట్టే ఇంత ధైర్యంగా అతనితో దిగిన ఫోటోలను పోస్ట్ చేసిందని అంటున్నారు. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వీరు.. కొంత కాలం కొంత కాలం పాటు మీడియా, జనం దృష్టిలో సహజీవనం చేస్తున్నట్లుగా చలామణి అవుతారు. త్వరలోనే టైం చూసి.. అఫీషియల్ తమ పెళ్లి విషయాన్ని బయట పెట్టనున్నారట.
{youtube}h4VNhbINMP0{/youtube}
Related