Saturday, May 11, 2024
- Advertisement -

నయనతార కొత్త వ్యవహారం!

- Advertisement -

ఇటీవలే సమంత, చైతూల ప్రేమ విషయమై ఒక క్లారిటీ వచ్చింది. చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగానే సమంత, చైతూలు ప్రేమించుకుంటున్నట్లుగా తాజాగా నాగార్జున ప్రకటించాడు. త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

పలు లీక్‌లు ఇచ్చిన తర్వాత వీరి ప్రేమను కన్ఫర్మ్‌ చేయడం జరిగింది. తాజాగా మరో ప్రేమ జంట కూడా తమ ప్రేమను దాదాపుగా కన్ఫర్మ్‌ చేయడం జరిగింది. నయనతార, విగ్నేష్‌ శివన్‌లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆ విషయంపై క్లారిటీ లేదు. తాజాగా ఒక క్లారిటీ వచ్చేసింది.

తాజాగా మలయాళం ప్రముఖ పండుగ ఓనమ్‌ పండుగ జరిగింది. ఈ వేడుకలో ఎప్పటిలాగే నయనతార పాల్గొంది. సొంత రాష్ట్రానికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంది. అయితే ఈ వేడుకకు తనతో పాటు తమిళనాడు నుండి కేరళకు తన బాయ్‌ ఫ్రెండ్‌ విగ్నేష్‌ను కూడా తీసుకు వెళ్లింది. ఇద్దరు కలిసి పండుగను తెగ ఎంజాయ్‌ చేయడం జరిగింది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో కూడా పెట్టారు. దాంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై ఒక క్లారిటీ వచ్చింది. వారిద్దరు అనధికారికంగా తమ ప్రేమను కన్ఫర్మ్‌ చేసినట్లుగా భావించవచ్చు.

Related

  1. నయనతార పని అయిపోయింది!
  2. నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!
  3. నయనతార కొంప ముంచిన హీరో!
  4. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -