సినీ పరిశ్రమలో మనస్పర్థలు మాములే. అయితే బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య మనస్పర్థలు ఉన్నాయి అని అందరికీ తెలిసిందే. అయితే బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒకే ప్రేమ్‌లో కనపడి చాలా కాలమే అయింది. అయితే తాజా వార్త ప్రకారం బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరు త్వరలోనే కలవబోతున్నారని తెలుస్తోంది.
నందమూరి ఫ్యాన్ ఈ ఇద్దరి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసే రోజులు త్వరలో రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటివలే రిలీజ్ అయిన శాతకర్ణి టీజర్‌పై ఎన్టీఆర్ ప్రశంసలు కురింపించిన సంగతి తెలిసిందే. శాతకర్ణిపై ఎన్టీఆర్ కురింపించిన ప్రశంసలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అయితే ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ బాలయ్య చెవిన పడ్డాయట. అయితే ఆయన రెస్పాన్స్ ఏమిటనేది వెంటనే తెలియరాలేదు.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ కామెంట్స్‌పై బాలయ్య హర్షం వ్యక్తం చేశారని, షూటింగ్ ముగిశాక ఎన్టీఆర్‌తో ఓ సారి భేటీ కూడా అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా బాబాయ్‌కి దగ్గరయ్యేందుకు చూస్తున్నాడు. శాతకర్ణి సినిమా ఫస్ట్ షో చూడాలని తారక్ ప్లాన్ వేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలీదు కానీ.. ఇది నిజమైయితే.. నందమూరి అభిమానులకు పండగే.
Related
