Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కు మీద భారీ కుట్ర‌!

- Advertisement -

ప్రస్తుతం యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్‌-నాన్న‌కు ప్రేమ‌తో-జ‌న‌తా గ్యారేజ్ వరస హిట్స్ తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇదే ఊపులో ఎన్టీఆర్ కు మరో సూపర్ హిట్ సినిమా పడితే ఎన్టీఆర్ ను అందుకోవడం ఎవరి వల్ల కాదు అనే చ‌ర్చ‌లు టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే  ఎన్టీఆర్ క్రేజ్‌ను త‌గ్గించేందుకు కొందరు కుట్ర చేస్తున్నట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్టీఆర్‌కు యాంటీగా ఓ టాప్ హీరో ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ పై భారీ కుట్ర పన్నార‌న్న చ‌ర్చ‌లు సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌కు ఒక ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్ట్ వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ టాప్ హీరో ఫ్యాన్స్ స‌ద‌రు జర్నలిస్ట్ పేరుతో ఫేక్ ట్విట్టర్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆ ఎకౌంట్‌ నుంచి ఎన్టీఆర్‌కు, జనతా గ్యారేజ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ కలెక్షన్స్ ఏపీల్లో, క‌ర్ణాట‌క‌ అసలు బాలేవు అని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఈ జర్నలిస్ట్ తన పేరుతో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడిందట. జనత గ్యారేజ్ సాధించిన స‌క్సెస్ చూడలేక ఓ టాప్ హీరో ఫ్యాన్స్ కావాలనే ఇలా చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ వ్యతిరేకులే ఇలా చేసి ఉంటారని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం సోషల్ నెట్‌వర్క్‌లో వైరల్‌గా ఉన్న ఆ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

Related

  1. శాత‌క‌ర్ణి టీజ‌ర్ చూసిన ఎన్టీఆర్ ఫిదా..!
  2. ఎన్టీఆర్ మళ్లీ ఎందుకు లావు అయ్యాడో తెలుసా?
  3. exclusive: కె.రాఘవేంద్రరావు తో ఎన్టీఆర్ సినిమా!
  4. ఎన్టీఆర్ కి షాకింగ్ నిజాలు చెప్పిన శృతీహాసన్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -