Monday, June 17, 2024
- Advertisement -

అకిరా చూసుకోవడం నా బాధ్యత : రేణు దేశాయ్

- Advertisement -

సోషల్ మీడియాలో రేణు దేశాయ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇటీవలే రేణు దేశాయ్ లైవ్ లోకి వచ్చింది. దాంతో వదినా మా నెక్స్ట్ హీరో, జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్‌ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ పవన్ అభిమాని సలహా ఇవ్వగా ఎప్పటిలాగే దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది రేణు దేశాయ్. “అన్నా.. అకిరా మీకు హీరో కావొచ్చేమో.. వాడు నా కొడుకు. మీ కంటే కూడా నా ప్రాణం వాడు.

ఒక తల్లికి అలా చెప్పకూడదు.. వాడు హీరో అయితేనే జాగ్రత్తగా చూసుకుంటాం అని కాదు.. వాడిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత’ అంటూ నవ్వుతూనే జవాబు ఇచ్చింది రేణు దేశాయ్. అలానే అకిరాని చూపించండి అని అడగగా.. ’వాడికి చాలా సిగ్గు. నా ఇన్ స్టాగ్రామ్‌కి రాడు. అందుకే వాడి ఫొటో కూడా పెట్టడం లేదు’ అని చెప్పింది. ఇక ‘అలవైకుంఠపురములో’ సాంగ్స్ విన్నారా? అంటే.. యా.. సూపర్బ్ సాంగ్స్.. అన్నీ పాటలు విన్నాను.

అందులోని సామజవరగమన సాంగ్ అకిరా ఎన్నిసార్లు విన్నాడో.. వాడి వల్ల నేను ఎన్నిసార్లు విన్నానో. అద్భుతమైన సాంగ్ అది’ అని అన్నారు రేణు. మరో నెటిజన్ రేణు దేశాయ్ పాపులర్ హిట్ సాంగ్‌ ‘చిగురాకు చాటు చిలకా’ అనే పాట పాడమనగా.. ఆ పాటను గుర్తుతెచ్చుకునేందుకు రేణు ఇబ్బంది పడింది. ఆ పాట నాకు తెలుసుకాని.. అది గుర్తురావడం లేదు.. ఏ పాట ఇది అంటూ పాట గుర్తుకు రావడం లేదంటూ చెప్పింది రేణు దేశాయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -