Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ వాడ్ని చంపేద్దామనుకున్నాడట!

- Advertisement -
pawan face to face with students

అనంతపురం లోని గుత్తి లో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ తో ముఖా ముఖి నిర్వహించిన పవన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న వయసులో ఉన్నప్పుడు తన అక్కని ఏడిపిస్తున్న వాడ్ని చంపేద్దామనుకున్నాడట.

అయితే పవన్ కళ్యాణ్ అప్పుడు చాలా చిన్నవాడు కావడంతో కుదరలేదు. ఈ విషయాన్నీ ఇప్పటికే ఒకసారి జనసేన ఆవిర్భావ సమయంలో చెప్పిన పవన్ తాజాగా అనంతపురం లో విద్యార్థుల ను కలిసిన సందర్భంగా మరోసారి చెప్పి సంచలనం సృష్టించాడు. ఆడవాళ్ళ ని అల్లరి చేసే ఆకతాయిలను చెప్పుతో కొట్టమని సలహా ఇచ్చాడు పవన్.

కొందరికి భుదాహం తీరడం లేదని ,అనంతపురం లో మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తానని వచ్చే ఎన్నికల్లో గెలిచినా , ఓడినా పోటీ చేయడం ఖాయమని అంటున్నాడు పవన్. తమ అభిమాన హీరో తమ దగ్గరకు రావడంతో పవన్ ని చూడటానికి ఉత్సాహం చూపించారు ఫ్యాన్స్. ఇక పవన్ సినిమాల విషయలకొస్తే… డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇదే కాక.. తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఓ సినిమా… అలాగే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు పవన్.

{youtube}WBY5036rfBg{/youtube}

Related

  1. యుద్దం చేసేటప్పుడు ఇలానే ప్రవర్తించాలి : పవన్ కళ్యాణ్
  2. నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే!
  3. పవన్ ఎందుకు ఆనందంగా లేడో తెలుసా?
  4. కన్నీళ్ళతో పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొన్నసప్తగిరి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -