Tuesday, April 30, 2024
- Advertisement -

నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే!

- Advertisement -
pawan kalyan response on cureency ban at gutti encounter

దేసవ్యాప్తంగా 500, 1000 నోట్లు రద్దు చేసి సంచలనం సృష్టించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రద్దు పై జనసేయన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. గురువారం అనంతపురం సభలో హోద సీమ సమస్యల గురించి మాత్రమే మాట్లాడిన పవన్ ఈ రోజు గుత్తి గేట్స్ కాలేజ్ విద్యార్దులతో ముఖాముఖి లో పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు.

ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. డబ్బులు పంచి ఓట్లు కొనుక్కునే స్థాయికి మన నాయకులు వచ్చారు. కాబట్టి పెద్ద నోట్ల రద్దు చేయడం చాలా మంచి పని అని అన్నారు. బ్లాక్ మనీని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ తీసుకొచ్చే విధానంలో చాలమంది ఇబ్బందులు పడొచ్చు.

ట్యాక్స్ ;లు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది. దానికి కారణం.. మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తే.. గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్ లు తీసుకొని, తిరిగి వాటికి తగ్గట్టు మనకు వసతులు కల్పించాలి. ప్రభుత్వం అలాంటి వసతులు కల్పించకపోవడం వల్లే సామాన్యుడు ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావడం లేదు. తాను డబ్బు కట్టి ప్రయోజనం ఏమిటి? ఎవరో రాజకీయనాయకులు తినేస్తారు. వాళ్ల జేబుల్లోకి వెళ్లిపోతాయనే సామాన్యులు టాక్స్ లు కట్టరు. ముందు అవినీతి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలి. మార్పు అక్కడి నుంచి రావాలి. అని పవన్ బదులిచ్చారు.

{youtube}WBY5036rfBg{/youtube}

Related

  1. పవన్ ఎందుకు ఆనందంగా లేడో తెలుసా?
  2. కన్నీళ్ళతో పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొన్నసప్తగిరి!
  3. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  4. దండం పెట్టకు.. నాకు దండం పెడితే ఇబ్బందిగా అనిపిస్తుంది-పవన్ కళ్యాణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -