Friday, May 24, 2024
- Advertisement -

ప‌వ‌న్ సినిమాలో ఎంతమంది హీరోలంటే?

- Advertisement -

ప్రస్తుతం పవన్ తన కొత్త సినిమాని డాలీ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టు వ‌ర్క్ కంప్లీట్ అయ్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పై వెళ్తోంది. అయితే ఈ చిత్రంకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… ఈ చిత్రంలో పవన్ తో పాటు మరో ముగ్గురు హీరోలూ క‌నిపిస్తార‌ట‌. కీల‌క‌మైన పాత్ర‌ల్లో యంగ్ హీరోల్ని తీసుకోవాల‌ని ప‌వ‌న్‌, డాలీ భావిస్తున్నారట.

ఈ పాత్రల కోసం శ‌ర్వానంద్‌, విజ‌య్‌దేవ‌క‌కొండ, న‌వీన్‌చంద్ర లాంటి యంగ్ హీరోల పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌య‌మై విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చిత్ర‌బృందం సంప్ర‌దిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పెళ్లి చూపులు చిత్రం తో మంచి పేరు తెచుకున్నాడు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పవన్ చిత్రంలో చాన్స్ వచ్చిందంటే… ఎక్క‌డికో వెళ్లిపోయిన‌ట్టే.

ప్ర‌స్తుతం చిత్ర‌బృందం లొకేష‌న్ల వేట ప్రారంభించింది. మ‌రోవైపు అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంబంధించిన బాణీలు ఇచ్చేశాడ‌ట‌. పాట‌ల రికార్డింగ్ మొద‌ల‌వ్వాల్సివుంది. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ ఫ్యాష‌నిస్ట్ లీడ‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌.

Related

  1. సోష‌ల్ మీడియాలో సందడి చేస్తోన్న ప‌వ‌న్ లెట‌ర్
  2. చిరు సినిమాకి పవన్ సలహాలు చెప్పాడట!
  3. పవన్ నిజంగానే కారును అమ్మేశాడా?
  4. పవన్ మళ్లీ ఆ తప్పే చేస్తున్నాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -