Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ నిజంగానే కారును అమ్మేశాడా?

- Advertisement -

ఓ సినిమా హిట్ అయితే ఆ తర్వాత ఆ సినిమాలో నటించిన హీరో ఏదైనా కొత్తవి కొనడం, పాతవి అమ్మడం లాంటివి చేస్తుంటారు. ప్రస్తుతం వరుస ప్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో ఓ ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ చెప్పడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కు ఆర్థికంగా బలాన్ని ఇచ్చే సినిమాలేవీ రాక పోవడంతో ఇపుడు ఆయన ఆర్థిక పరిస్థితి మీద నెగెటివ్ ప్రచారం జరుగుతోంది.

నిర్మాణంలో తాను భాగస్వామ్యం అయ్యి తీసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతిందని, ఇపుడు తన కార్లను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గతంలో మెర్సిడెస్ బెంజ్ జి55 మోడల్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇపుడు ఆర్థిక పరిస్థితి బాగేలోక పోవడంతో పవన్ కళ్యాణ్ ఆ కారును అమ్మేశాడని ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కో అంటే కోట్లు రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఆయన ముందు వాలే నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి కారణంగా కార్లు అమ్ముకునే స్థితి మాత్రం ఉండదనేది చాలా మంది అభిప్రాయం.

Related

  1. పవన్ మళ్లీ ఆ తప్పే చేస్తున్నాడా?
  2. ఈటీవీ కి పవన్ షాక్!
  3. పవన్ కళ్యాణ్ కొంప ముంచుతాడా ?
  4. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -