Tuesday, May 21, 2024
- Advertisement -

సోష‌ల్ మీడియాలో సందడి చేస్తోన్న ప‌వ‌న్ లెట‌ర్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రెంజ్ లో పాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పవన్ ఏం చేసినా అద్భుతమై. సినిమాలో ఏలా ఉన్నప్పటికి నిజ జీవితంలో చాలా సింఫుల్ గా ఉంటాడు. అందుకే కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కు మరిచిపోలేని ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో పొంగిపోయిన పవన్ త్రివిక్రమ్‌కు లెటర్ రూపంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసిన ఉత్తరం ఒకటి ప్రస్తుతం ఆన్లైన్లో సందడి చేస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పవన్ కు ఇచ్చారు. ఈ పుస్తకం పవన్ కు చాలా బాగా నచ్చడంతో  ప్రింట్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ అవకాశం కలిగించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, శేషేంద్రగారి కొడుకు సాత్యకీలకు పవన్ కళ్యాణ్ ఉత్తరం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆ లెటర్లో “ఒక దేశపు సంపద.. ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు అన్న మహాకవి శేషేంద్ర గారి మాటలు.. ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేశాయి. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా.? అని ఆయన వేసిన ప్రశ్న నాకు మహాకాయంగా మారింది.

నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆధునిక మహాభారత గ్రంథం సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడేవారికి అందుబాటులో ఉండాలన్న నా ఆకాంక్ష, ఈ గ్రంథాన్ని మరో మారు మీ ముందుకు తీసుకువచ్చేలా చేసింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహాకవి శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన సాత్యకి గారికి, నాకీ మహాకవిని నాకు పరిచయం చేసిన నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు’ అంటూ రాశారు. 

Related

  1. ఇండైరెక్ట్ గా సహాయం చేసిన పవర్ స్టార్!
  2. మరోసారి గట్టి పోటికి పవర్ స్టార్!
  3. పవర్ స్టార్ ఫ్యాన్స్ vs స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్
  4. ఎన్టీఆర్ కోసం మహేష్ మరో సహాయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -