పవన్ ఫ్యాన్స్.. లైవ్ లో పెద్ద గొడవ చేశారు

Pawan Kalyan Fans Fighting With Anchor In MANA TV Studio

ఒక లోకల్ ఛానల్ జరిగిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఫ్యాన్స్ రాను రానూ చాలా హింసాత్మకంగా తయారవుతున్నారంటూ ఆ ఇన్సిడెంట్ చూపిస్తూ అందరూ కామెంట్ చేస్తున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ”కాటమరాయుడు” విడుదల రోజు ఏం చేశరో చూద్దాం.. కాటమరాయుడు మూవీ ఎలాందో చెప్పడానికి కేవలం ఒక యాంకర్ కమ్ క్రిటిక్ తో వీడియో రివ్యూ చెప్పించడమే కాదు.. ఆ ప్రోగ్రాంకి కొందరూ సో కాల్డ్ పవన్ ఫ్యాన్స్ ను కూడా పిలిచారు.

ఇక ఈ మూవీకి 3 స్టార్లు రేటింగ్ ఇస్తున్నాం అని చెప్పగానే.. మమ్మల్ని స్టూడియోకు పిలిచి మరీ ఇలా 3 రేటింగ్ ఇస్తారా అంటూ అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ రెచ్చిపోయి.. వాటర్ బాటిళ్లను నేలకేసి కొట్టేసి.. నానా రచ్చ చేశారు. అసలు పవన్ అభిమానులు అంటూ చెప్పుకుంటున్న వీరు నిజంగా పవన్  ఫ్యాన్ ఆర్గనైజేషన్ల మెంబర్లో కాదో తెలియదు కాని.. ఇలా లైవ్ లో రచ్చ చేస్తే మాత్రం మచ్చ పవన్ కళ్యాణ్ కు వస్తుంది అని గ్రహించాలి గురూ.

అసలు 3 రేటింగ్ ఇస్తేనే ఈ రెంజ్ లో రచ్చ చేశారంటే.. అంతకమంటే తక్కువ ఇస్తే.. ఏం చేశేవారో. ఇక అక్కడి గొడవ చూస్తే.. ఇదేదో రేటింగులు కోసం సదరు చానల్ వారే కావాలని గొడవ చేయించినట్లు ఉంది. ఆ గొడవ నిజంగా ఎమోషన్ తో కాకుండా.. స్ర్కిప్టు ప్రకారం చేసినట్టు ఉంది వారి యాక్షన్. వీడియోను చూసినవారు ఈ విధంగా కామెంట్లు చేయడం గమనార్హం. 

{youtube}LebP3XmK1vY{/youtube}

{youtube}ov1fypY8WO4{/youtube}

Related

  1. పవన్ కీ ఇతర హీరోలకీ అదే తేడా 
  2. పవన్ ఫ్యాన్స్ పై మహేష్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు..?
  3. ఆ రోజు పవన్ ఎందుకు అలా నవ్వాడో తెలుస్తే షాక్ అవుతారు
  4. పవన్ బరిలోకి దిగితే ఎవరికి లాభం..?