Monday, May 20, 2024
- Advertisement -

మెగా హీరోయిన్ కి షాక్ ఇచ్చిన యంగ్ హీరో

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఒక మనసు’. ఈ సినిమా ఆశించిన విజయం సొంతం చేసుకోలేకపోయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘ఒక మనసు’ నిరాశ పర్చడంతో నిహారిక రెండవ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ‘ఒక మనసు’ ప్లాప్ కావడంతో ఈమె సినిమాలు చేయదు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే నిహారిక మంచి కథ దొరికితే ఖచ్చితంగా సినిమా చేస్తాను అంటోంది.

తాజాగా ఈమె వద్దకు ఒక మంచి కథ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ స్టోరి నచ్చడంతో ఇందులో నటించేందుకు నిహారిక ఓకే చెప్పింది. అయితే ఈమెకు జోడీగా నటించేందుకు నిఖిల్‌ నో చెప్పడంతో మొత్తానికే ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ కొట్టుకుంటూ దూసుకు పోతున్న నిఖిల్‌కు నిహారిక చిత్రంలో నటించే చాన్స్ వచ్చింది.

ఒక న్యూ డైరెక్టర్ నిఖిల్‌ దగ్గరకు స్క్రిప్ట్‌ను తీసుకు వెళ్లాడు. ఆ స్క్రిప్ట్‌ వినకుండానే నిహారికతో కలిసి నటించడం తన వల్ల కాదు అంటూ తప్పుకున్నాడు. నిహారికతో సినిమా చేస్తే రొమాన్స్‌ చేసే వీలుండదు, ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మెగా హీరోయిన్‌ అనే బ్రాండ్‌ ఈమెకు ఉండటం వల్ల ఎవరు కూడా ఈమెతో నటించేందుకు ముందుకు రావడం లేదు. దాంతో నిహారిక చాలా బాదపడుతోందట. మరి నిహారిక రెండో సినిమా హీరోయిన్‌ ఓరియంటెడ్‌గా ఉంటుందేమో మరి.

Related

  1. వామ్మో…నిహారిక ఇలా కూడా చేస్తుందా?
  2. ఒక మనసు దెబ్బ గట్టిగానే తగిలింది నిహారికకు!
  3. నిహారిక సినిమా ఇప్పట్లో లేదట!
  4. అయ్యో…నిహారిక!!?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -