Monday, May 6, 2024
- Advertisement -

ఏషియన్‌ ఫెలోషిప్‌’ అవార్డును అందుకున్న స‌చిన్

- Advertisement -
Sachin Tendulkar among the winners in Asian Awards ceremony

క్రికెట్ దేవుడు స‌చిన్ టెండుల్‌క‌ర్‌కు వ‌చ్చిన అవార్డుల గురించి పెప్పాల్సిన ప‌నిలోదు. ఇప్పుడు స‌చిన్ కాతాలో మ‌రో అవార్డు వ‌చ్చిచేరింది. లండన్‌లోని పార్క్‌లేన్‌ హిల్టన్‌లో ప్రతిష్ఠాత్మక 7వ ఏషియన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన, సేవలందించిన ప్రముఖులకు బహుమతులు అందజేశారు.

దీంతో మ‌రో అరుదైన గౌర‌వ‌రం ద‌క్కింది.ఏషియన్‌ ఫెలోషిప్‌’ అవార్డును సచిన్‌ తెందుల్కర్‌ అందుకున్నారు. అలాగే ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు అద్నన్‌ సమి… ‘ఔట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ మ్యూజిక్‌’ అవార్డును అందుకున్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన బాలీవుడ్‌ నటుడు ఓమ్‌ పురికి నివాళులర్పించారు. ఆయనకు ప్రకటించిన ‘ఔట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ సినిమా’ అవార్డును ఆయన భార్య నందిత పురి, కుమారుడు ఇషాన్‌ పురి అందుకున్నారు.
లయన్‌’ చిత్రం ద్వారా అభిమానులను సంపాదించుకున్న బాలుడు సన్నీ పవర్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌… సన్నీ పవర్‌కు ‘రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును అందజేశాడు. ‘తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న బాలుడు సన్నీ పవర్‌తో ఉన్నాను. మా అందరి హృదయాలను దోచుకున్నాడు’ అని కార్యక్రమం అనంతరం సచిన్‌ తెందుల్కర్‌ ట్వీట్‌ చేశాడు.

Related

  1. స‌చిన్‌కు తొలిసారి బ్యాట్‌ను ఇచ్చింది ఎవ‌రు….
  2. దిగ‌జారిన సింధూ,సైనైనెహ్వాల్ ర్యాంకులు
  3. చాంపియన్స్ ట్రోఫీపై వీడ‌ని ఉత్కంఠ‌…
  4. టీమిండియా కొత్త‌ జెర్సీ వ‌చ్చేసింది…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -