Friday, April 26, 2024
- Advertisement -

ఆ ఒక్క సినిమాతో మారిపోయిన త‌ల‌రాత‌

- Advertisement -

కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో.. గౌరి రోణంకి దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ప‌రిచ‌మైన చిన్న‌ది శ్రీలీల‌. అదిరిపోయే గ్లామర్ అపీరెన్స్ తో పాటు ఆమె నటన కుర్ర‌కారుకు మ‌త్తెక్కించింది. ఆ సినిమా ఏకంగా రూ. 10కోట్లు వసూలు చేసింది. తొలి రోజు తొలి షోకే ఫ్లాప్ టాక్ వచ్చినా.. దాంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద షాకింగ్ కలెక్షన్స్ తెచ్చుకుని ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది.

‘పెళ్ళిసందD’ సినిమా సక్సెస్ క్రెడిట్ తో శ్రీలీల సుడి తిరిగింది. అవ‌కాశాల మీద అవ‌కాశాలు ఆమెను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. శ్రీలీల ఏకంగా మూడు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. మూడూ పెద్ద సినిమాలే. రవితేజ, నవీన్ పోలిశెట్టి హీరోలుగా నటిస్తున్న చిత్రాలవి. ఒక స‌రైన హిట్ చేతిలో ఉంటే చాలు హీరోయిన్ల పారితోషికానికి రెక్క‌లొచ్చేస్తాయి. ఈ అమ్మ‌డు విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. భారీగా రెమ్యూన‌రేష‌న్ ను పెంచేసింది శ్రీలీల‌.

తొలి సినిమాకి కేవలం రూ. 5లక్షలే అందుకున్న శ్రీలీల తర్వాత సినిమాకి రూ. 40లక్షలు అందుకుంది. ఆ తర్వాత సినిమాకి రూ. 75 లక్షలు తీసుకుంది. ఇప్పుడు శ్రీలీల‌ను కథానాయికగా ఎంపికచేయాలంటే.. ఆమెకి అక్షరాలా కోటి సమర్పించాల్సిందే. కొత్తగా ఎవరైనా కథ చెప్పడానికి వెళ్తే కోటి ఇమ్మని డిమాండ్ చేస్తోందట.

మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కంగ‌న

రిలీజ్ డేట్ లాక్ చేసిన బ‌న్నీ, సుకుమార్

మాస్టర్ హీరోయిన్‌ పంట పండింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -