రిలీజ్ డేట్ లాక్ చేసిన బ‌న్నీ, సుకుమార్

పుష్ప త‌ర్వాత త‌గ్గేదే లేదంటున్నాడు బ‌న్నీ. దాంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడా అని ఆయ‌న అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. నిజానికి ‘పుష్ప2’ షూటింగ్ కి వెళ్ళబోయే ముందు మరో సినిమా చేయాలని భావించాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను, కొరటాల శివ, లింగుస్వామి వంటి దర్శకులు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు.

అయితే ‘పుష్ప’ ఘన విజయం అల్లు అర్జున్ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. ఇదే ఊపు మీద ఈ సీక్వెల్‌తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అందుకే మిగ‌తా ద‌ర్శ‌కుల‌తో చిత్రాల‌న్నీ పుష్ప 2 త‌ర్వాతే ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అటు బన్నీతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళే ముందే ‘పుష్ప 2’ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంతే కాదు ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేసుకున్నారట. పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న విడుదలైంది. ఇప్పుడు రెండవ భాగం ‘పుష్ప: ది రూల్‌’ని కూడా డిసెంబర్ 17న విడుదల చేయాలని భావిస్తున్నార‌ట‌.

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కి దాదాపు 9 నెలల టైమ్ ఉంది. ‘పుష్ప’ ద రైజ్‌’ విడుదలను హడావుడిగా చేయటంతో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. రెండో భాగాన్ని అలా కాకుండా పక్కా ప్లాన్ తో భారీ ప్రచారం చేసి మరీ విడుదల చేసేలా ప్లాన్ చేయనున్నారు. తొలి భాగాన్ని మించి సక్సెస్ చేయల‌ని భావిస్తున్నారు సుకుమార్, బన్నీ. అటు కంటిన్యుటీ కోసం బ‌న్నీ గడ్డాన్ని అలాగే ఉంచాడట. మొత్త‌మ్మీద భారీ ప్లాన్స్ తోనే ఉన్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

మాస్టర్ హీరోయిన్‌ పంట పండింది

మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్

విజయ్ దేవరకొండ సినిమాకు దర్శకుడు ఆయనేనా ?

Related Articles

Most Populer

Recent Posts