పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కు ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

- Advertisement -

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అమ్మడు పూజా హెగ్డే. ఆమె సినిమా ఒప్పుకుంటే హిట్టేనంటూ మొన్నటి మొన్న నిర్మాత దిల్ రాజు ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరితోనూ పూజా హెగ్డే సినిమాలు చేయడం విశేషం. నటనతోనే కాదు అప్పుడప్పుడూ ఐటమ్ నెంబర్స్ తోనూ అలరిస్తోందీ చిన్నది.

అప్పుడెప్పుడో రామ్‌ చరణ్ నటించిన రంగస్థలం మూవీలో ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌రాణి..’ అంటూ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఇక తాజాగా ఈ అమ్మడు చేసిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఒక సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా పూజా హెగ్డేకు మరో ఐటం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అందుకు ఈ చిన్నది ఒప్పుకుందట. అయితే ఈ ఐటం సాంగ్ కోసం పూజా ఏకంగా కోటి 25 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సాంగ్‌ కోసం మరీ ఆ రేంజ్‌లో డిమాండ్‌ చేయడమా..ఆశ్చర్యపోవడం నిర్మాతల వంతు అయ్యింది. చివరకు తాము కోటి రూపాయలు ఇవ్వగలం అంటూ ఆమెను ఒప్పించినట్లు సమాచారం.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -