ఓటుకు లంచం ..27పైసలు !

- Advertisement -

నేటి రోజుల్లో రాజకీయాలు అంటే ప్రతి పౌరుడికీ చులకన గానే మారాయి. లంచాలు ఇచ్చి ఓట్లను కొనుక్కోవడం.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన లంచాలను దండుకోవడమే కాకుండా ప్రజల సొమ్మును కూడా మింగివేయడం ప్రస్తుతం మన రాజకీయ నాయకుల ప్రధాన ఎజెండా అని చెప్పవచ్చు. అంతే కాకుండా నేటి రోజుల్లో ప్రజలు కూడా లంచాలు ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులు ఓట్ల కోసం ప్రజలకు వేసే ప్రధాన ఎరా ” ఓటు కు నోటు “..

ఈ నేపథ్యంలో ఓటుకు ఉండే అసలైన విలువ చచ్చిపోతోందనే చెప్పాలి. ప్రజా పరిపాలన కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలకు ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం ఓటు. అంతటి శక్తివంతమైన ఓటును రాజకీయ నాయకులు డబ్బుతో కొనుకొని విచ్చలవిడి పరిపాలనకు కేంద్రబిందువు అవుతున్నారు. మరి అంతటి శక్తివంతమైన ఓటు విలువ పోతున్న నేటిరోజుల్లో ఓ సామాన్యుడు ఓటర్ల కళ్ళు తెరిపించేలా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్మూర్ కు చెందిన అబ్దుల్ హుసేన్ అనే వ్యక్తి తన ఆటో వెనక ఓటుకు డబ్బులు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సి తో ఓటర్ల కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నాడు.

- Advertisement -

” ఓటరులారా .. ఒక్క విషయం ఆలోచించండి. ఐదు సంవత్సరాలు పాలించే నాయకుడు ఓటు కోసం మీకిచ్చే సంచం 500 రూపాయలు..అంటే రోజుకు 27 పైసలు..బిచ్చం ఎత్తుకునే వాడు కూడా 27 పైసలు తీసుకోడు.. ఒక్క సారి ఆలోచించండి.. డబ్బు కావాలా ! మంచి నాయకుడు కావాలా ! ” .. అంటూ ఫ్లెక్సిలో రాశాడు. నిజంగా అతడు చెప్పిన మాటలను నూరుశాతం ఒప్పుకోక తప్పదు. ఐదు వందలకు ఆశపడి సరైన నాయకుడిని ఎంచుకునే విలువైన ఓటును.. అక్రమ పాలకులకు వెయ్యడం వల్ల వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకోవడం తప్పా .. అభివృద్ది గురించి ఆలోచించరు. కాబట్టి మీకున్న విలువైన ఓటును డబ్బు కోసం కాకుండా సరైన నాయకుడి కోసం ఉపయోగించండి.

ఇవి కూడా చదవండి

వర్గ పోరు గట్టెకేనా ?

చంద్రబాబు ప్లాన్ అధిరిందిగా !

వాలెంటిర్లు జగన్ కు లాభామా ? నష్టమా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -