వైసీపీ లో జంపింగ్ జపాంగ్ ..షురూ ?

- Advertisement -

ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. ప్రత్యర్థి పార్టీలను దారుణంగా దెబ్బ తీసే పనిలో ఉంటాయి. తమ పార్టీ బలం ప్రజల్లో ఏ స్థాయిలో ఉందనే విషయం పక్కన పెడితే ప్రత్యర్థి పార్టీతో మైండ్ గేమ్ ఆడుతూ మానసికంగా దెబ్బతీసే ప్రయత్నలే ఎక్కువ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక పార్టీలోని నేతలను, ఎమ్మెల్యే లను మరొక పార్టీలోకి లాక్కోవడం, లేదా సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు అసమ్మతి కారణంగా వేరే పార్టీలో చేరడం వంటివి చూస్తూఉంటాం. ఇలా ఎమ్మెల్యేలతో జంపింగ్ జపాంగ్ పద్దతి యూస్ చెయ్యడం వల్ల పార్టీ క్యాడర్ బలం తగ్గుతుంది. దీంతో వ్యక్తిని వట్టి వచ్చే ఓట్ల మెజారిటీ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే ఒక పార్టీలోని ఎమ్మేల్యేలు గాని, నేతలు గాని, వేరే పార్టీలోకి వెళ్లకుండా వారిని కాపాడుకోవడమే రాజకీయ పార్టీలకు పెద్ద టాస్క్ గా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యం లో టీడీపీ ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం వైసీపీ ని దెబ్బకొట్టే ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా టీడీపీ వదలడం లేదు. వైసీపీని ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ తాజాగా మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్సీలు తమతో టచ్ లో ఉన్నారని ఆ మద్య టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు.

- Advertisement -

తాజాగా అనంతపురంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీకి చెందిన 60 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, తమ అద్యక్షుడు అంగీకరిస్తే టీడీపీ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనే విషయం స్పష్టంగా అర్థమౌతుంది. ఎందుకంటే నిజంగా 60 మంది ఎమ్మేల్యేలు టీడీపీతో టచ్ లో ఉంటే ఎందుకు చేర్చుకోవడం లేదు ? చేర్చుకొని ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవడం లేదు ? అనే సందేహాలు రాక మానవు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ ను మానసికంగా దెబ్బతీసేందుకు టీడీపీ వేసిన కొత్త వ్యూహం అనే విషయం క్లియర్ గా అర్థమౌతుంది.

ఇవి కూడా చదవండి

బిచ్చమెత్తుకునేవాడు.. ఓటర్ ఒక్కటేనా ?

చైనా అధ్యక్షుడికి నో రిటైర్మెంట్ ..?

అలా చేస్తే కే‌సి‌ఆర్ కు ముప్పే ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -