Friday, April 26, 2024
- Advertisement -

లైసన్స్ లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు !

- Advertisement -

మన దేశంలో రోజురోజుకూ రోడ్ యాక్సిడెంట్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దాదాపుగా దేశంలోని అన్నీ రాష్ట్రాలలో కూడా రోడ్ యాక్సిడెంట్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ యాక్సిడెంట్ కేసులను తగ్గించేందుకు కొత్త విధానాలను చేపడుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠిన తరం చేస్తున్నాయి. వాహన దారులు డ్రైవింగ్ లైసన్స్, ఆర్ సి, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటిని పొండడానికి కటినమైన నియమాలను అమలు చేస్తున్నాయి. .

ఈ నేపథ్యంలో వాహనదారుడు డ్రైవింగ్ లైసన్స్, ఆర్ సి, వంటి వాటిని పొరపాటున మర్చిపోతే అంతే సంగతులు.. జేబులకు భారీగా చిల్లు పడడం ఖాయం. ఈ నేపథ్యంలో రోడ్డు పైకి వచ్చే వారు డ్రైవింగ్ లైసన్స్ వంటి వాటిని మర్చిపోయే వారికి త్వరలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. వాహనానికి సంబంధించిన అన్నీ డాక్యుమెంట్స్ ఒకే చోట ఉండేలా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఓ యాప్ ను ఋపొందించబోతున్నట్లు తెలిపింది.

వాహన దారుడు ఆ యాప్ లో బండి నెంబర్ మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకుంటే చాలు వాహన దారుడికి సంబంధించిన అన్నీ డాక్యుమెంట్ అనగా డ్రైవింగ్ లైసన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఆర్ సి, వంటివి ఆ యాప్ లో దర్శనమిస్తాయి. వాటిని యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తే చాలు. అంతే కాకుండా వాటిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. ప్రస్తుతం లైసన్స్ లేని వారు ఉంటారు గాని.. స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండరు..కాబట్టి లైసన్స్ వంటి డాక్యుమెంట్స్ మర్చిపోయినప్పటికి, మొబైల్ ద్వారా వాటిని చూపించి ట్రాఫిక్ పోలీసులు విధించే ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

కృత్రిమ మానవులు వచ్చేస్తున్నారోచ్ ..!

అయ్యో పాపం .. ఉక్రెయిన్ ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -