Friday, March 29, 2024
- Advertisement -

పవన్​ ​- హరీశ్​ శంకర్​ సినిమాలో విలన్​గా ప్రకాశ్​రాజ్​?

- Advertisement -

పవన్​ ​- హరీశ్​ శంకర్ కాంబోలో ‘PSPK 28’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్​గా ప్రకాశ్​రాజ్​ కనిపించబోతున్నట్టు సమాచారం. మొదట పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కలసి నటించిన చిత్రం బద్రి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నందాగా, పవన్ బద్రి గా పోటాపోటీగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బద్రిలో హైలెట్ గా నిలిచాయి. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించారు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ లోనూ ప్రకాష్ రాజ్ కీలకమైన పాత్రలో నటించాడు. మళ్లీ వీరిద్దరూ హరీశ్ శంకర్ సినిమాలో తల పడబోతున్నారు.

గతంలో పవన్​కల్యాణ్​తో హరీశ్​శంకర్​ తెరకెక్కించిన గబ్బర్​సింగ్​ సంచలన విజయం నమోదుచేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి కాంబోలో వస్తున్న సినిమాపై అటు ట్రేడ్ లోనూ ఇటు అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు పవన్​కల్యాణ్ గత చిత్రం వకీల్​సాబ్​ ఘన విజయం సాధించింది. దీని తర్వాత పవన్​ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు, ఓ రీమేక్ లో నటించబోతున్నాడు.

కాగా హరీశ్‌ శంకర్‌ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. ‘బద్రి’ సినిమా నుంచి పవన్‌కల్యాణ్‌, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే పవర్‌ఫుల్‌ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. “మరోసారి అదే ఎనర్జీని చూద్దాం” అని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే బద్రిలో ప్రకాశ్​రాజ్​ విలన్​ కాబట్టి.. కొత్తగా తెరకెక్కించే చిత్రంలోనూ ఆయన విలన్​గా కనిపించబోతున్నట్టు ఫ్యాన్స్​ చర్చించుకుంటున్నారు. వీడియోలో ప్రకాష్ రాజ్ ని చూపి హరీశ్ ఇదే హింట్ ఇచ్చాడని అంటున్నారు. ఏం జరగబోతుందో వేచి చూడాలి.

Also Read

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!

‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -