Friday, May 3, 2024
- Advertisement -

రాజ్ తరుణ్ బ్యాడ్ టైమ్… వరుస ఫ్లాపులు!

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అంటే ఎవరూ తెలియని వారుండరు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకోని ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు పూర్తిగా ఫేడ్ ఔట్ అయిపోయాడు. దీనికి తాజా నిదర్శనం రాజ్ తరుణ్ నటించిన పవర్ ప్లే సినిమా. నిజానికి ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలా మందికి తెలీదు. గుండెజారి గల్లంతయ్యిందే ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో విడుదలైన సినిమా ఇది.

సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. గతంలో రాజ్ తరుణ్ నటించిన చిత్రాలకు మంచి ప్రమోషన్స్ ఉండేవి. కానీ ఈ మద్య రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రాలకు ప్రమోషన్స్ లేవు.. హంగూ ఆర్భాటాలు లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ ప్లే కి టాక్ నెగిటివ్ అని రావడంతో జనాలు లైట్ తీసుకున్నారు.యూనిట్ కూడా పట్టించుకోలేదు. కనీసం రివ్యూ రాసే సైట్స్ కూడా ఈ సినిమాకి ప్రాధన్యత ఇవ్వలేదు.

మొత్తానికి రాజ్ తరుణ్ కెరీర్ లో ఇంత తక్కువ పబ్లిసిటీ వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో లేదు. సినిమాలో విషయం వుంటే యూనిట్ చిన్న ప్రెస్ మీట్ అయినా పెట్టేది. కానీ విషయం లేదని తెలివడంతో పాపం పవర్ ప్లే ని అందరూ మర్చిపోయి అస్సలు పట్టించుకోలేదు.ఇక రాజ్ తరుణ్ పని పూర్తిగా అయిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు…

వోకల్​ ఫర్ లోకల్ పేరుతో మోదీ మళ్లీ మొదలు..!

పిల్లలు పుట్టకుండా సింహానికి ఆపరేషన్!

హైదరాబాద్ లో జలకన్య ఆకారంలో వింత శిశువు జననం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -