Wednesday, May 15, 2024
- Advertisement -

జగన్ గురుంచి పింగళి మనవరాలి కామెంట్స్ హల్ చల్..!

- Advertisement -

ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఇంటికి వచ్చి యోగక్షేమాలు అడగటంపై పింగళి వెంకయ్య కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​ను చూస్తే సొంత మనుమడిని చూసినట్లు ఉందని వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అన్నారు. తాను జీవించి ఉండగానే పింగళికి భారతరత్న ఇస్తే ఎంతో సంతోషిస్తానని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ను పురస్కరించుకుని పింగళికి భారత రత్న ప్రకటించటం సముచితమని ముఖ్యమంత్రి లేఖలో పేర్కోన్నారు.

మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య స్వాంతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించారని… ఆయన అందించిన సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని సీఎం పేర్కొన్నారు. అరుణాఆసఫ్ అలీ, భూపేంద్రకుమార్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ లాంటి ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎం వెల్లడించారు.

రాజ్ తరుణ్ బ్యాడ్ టైమ్… వరుస ఫ్లాపులు!

కొంచెం తిన్నా.. కడుపులో సమస్యలొస్తున్నాయా?

చిరంజీవి చేతుల మీదుగా ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్!

నిరుద్యోగ భృతితో పాటు 50వేల ఉద్యోగాలు భర్తీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -