Saturday, April 20, 2024
- Advertisement -

కొంచెం తిన్నా.. కడుపులో సమస్యలొస్తున్నాయా?

- Advertisement -

వయసుతో సంబంధం లేకుండా.. నేటి ఆధునిక ప్రపంచంలో అజీర్థి సమస్య వేధిస్తోంది. నాడు యువత రాళ్లను సైతం అరిగించేకునే శక్తి కలిగి ఉండేవారంటూ పెద్దలు చెప్తుండే వారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నల నుంచి పెద్దల వరకు ఆహారాన్ని జీర్ణించుకోలేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ రుచికరమైన ఆహారానికే అలవాటుపడిపోయారు. కానీ వీరిలో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అతి తక్కువగా తిన్నా సరే.. ఆహారం జీర్ణం కాకపోవడమో, లేక గ్యాస్ట్రిక్ సమస్యనో లేకపోతే కడుపునొప్పి, కడుపులో మంట వంటి అనేక రకాల సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చటి నీరు తాగాల్సిందే. ప్రతి రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగవడమే కాకుండా.. కడుపుకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫైబర్ ఎక్కువ లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

కూరగాయలు, పళ్లు, తృణధాన్యాలల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిని తినాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే తరచుగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తే మాత్రం.. మీరు ఖచ్చితంగా వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలి. ఇలా ఉండటం వల్ల జీర్ణక్రియ రీసెట్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే మీకు జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేనప్పుడు చల్లటి పానియాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఫ్రిజ్ లో పెట్టిన వాటర్, ఆహార పదార్థలకు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా మట్టికుండ నీరు మేలు చేస్తుంది. అరగంట లేదా గంటపాటు వాకింగ్ కూడా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -