Tuesday, May 7, 2024
- Advertisement -

బాహుబ‌లి వెంట‌నే రాజమౌళి చేయబోయే సినిమా అదేనట

- Advertisement -
Rajamouli Next Movie without Much Hype

బాహుబ‌లి 2 తెలుగు మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఒక తెలుగు సినిమాకు ఫ్యూచ‌ర్‌లో ఇంత భారీ అంచ‌నాలున్న సినిమా మ‌రొక‌టి ఉంటుందో ఉండ‌దో చెప్ప‌లేం కానీ.. జ‌క్క‌న్న బాహుబ‌లి పుణ్య‌మా అని.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ద‌క్కిన గౌర‌వం అంతా ఇంతా కాదు. మ‌రికొద్ది రోజుల్లో బాహుబ‌లి బ‌య‌ట‌కు వ‌చ్చేందుక సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. ఆ సినిమాకు సంబంధించిన ముచ్చ‌ట్లు డైలీ బేసిస్ లో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఏ ఇద్ద‌రు క‌లిసినా.. త‌మ మాట‌ల మ‌ధ్య‌లో ఎప్పుడో ఒక‌సారైనా బాహుబ‌లి గురించి మాట్లాడుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి. ఇంత‌లా ప్ర‌భావితం చేసిన జ‌క్క‌న్న‌.. బాహుబ‌లి త‌ర్వాత తీసే సినిమా ఏద‌న్న దానిపై భారీ చ‌ర్చే జ‌రుగుతోంది. బాహుబ‌లి లాంటి గ్రాండ్ మూవీ త‌ర్వాత‌.. ఈసారి ఆయ‌న టార్గెట్ ఏకంగా బాలీవుడ్డేన‌ని చెప్పేవాళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. జ‌క్క‌న్న ప్లానింగ్ అలా ఉండ‌ద‌ని.. అందుకు భిన్నంగా.. ఊహించ‌ని రీతిలో షాకిచ్చేలా ఉంటుంద‌ని చెబుతున్నారు.

రీసెంట్ గా అందుతున్న సమాచరం ప్రకారం.. బాహుబ‌లి త‌ర్వాత సినిమా మ‌ర్యాద‌రామ‌న్న త‌ర‌హాలో.. స్ర్కీన్‌ప్లే  స్ట్రాంగ్ గా ఉండేలా మూవీని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బాహుబ‌లి మూవీ ఫుణ్య‌మా అని ఆకాశానికి అంటిన కీర్తి ప్ర‌తిష్ఠ‌ల పుణ్య‌మా అని.. ఎంత పెద్ద హీరో అయినా డేట్లు ఇచ్చేందుకు రెఢీగా ఉన్నప్ప‌టికీ.. జ‌క్క‌న్న మాత్రం త‌న‌దైన శైలిలో ఒక మోస్త‌రు బ‌డ్జెట్‌తో మూవీ చేసేస్తార‌ని చెబుతున్నారు. ఈ మాట‌ల్లో నిజం ఎంతో తేలాలంటే.. మొద‌ట బాహుబ‌లి రిలీజ్ కావాలి. ఆ త‌ర్వాత జ‌క్క‌న్న కాస్త రిలాక్స్ కావాలి. అప్పుడు మాత్ర‌మే ఈ ముచ్చ‌ట‌లో నిజం పాళ్లు నిగ్గు తేలేది.

{youtube}_60TVPuk0JM{/youtube}

Related

  1. అనుష్క బరువు తో రాజమౌళికి తలనొప్పి.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?
  2. రాజమౌళిని పట్టుకుని ఏడ్చేసిన ఈ అమ్మాయి ఎవరంటే..?
  3. చరణ్ తో రాజమౌళి ఎందుకు సినిమా చేయడు..?
  4. రాజమౌళి కి మంచులక్ష్మి కి మధ్య ఏం జరిగింది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -