రాజకీయాల్లోకి రాలేనంటూ చెప్పేసిన సూపర్ స్టార్ మళ్లీ తన దృష్టిని సినిమాలపై పెట్టాడు. ఇప్పడు ఆయన యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ దర్శకులైతే తనను డిఫరెంట్ స్టయిల్ లో చూపిస్తారని రజినీకాంత్ నమ్ముతున్నారట. అందుకు తగ్గట్టే పలువురు దర్శకులు ఆయనను కొత్తగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ క్రమంలో కార్తీక్ సుబ్బరాజు మరో అవకాశాన్ని కొట్టేసినట్లు తెలుస్తుంది. ఈ యువ డైరెక్టర్ ఆమధ్య రజినీకాంత్ తో పేట సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రజినీకాంత్ ను ఈ డైరెక్టర్ డిఫరెంట్ గా చూపించిన విషయం తెలిసిందే. అలాగే సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దాంతో మళ్లీ ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రజినీకాంత్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దీనికోసం స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమా తిస్తున్నారు. అన్నాత్తే పేరుతో తీస్తున్న ఈ సినిమాను వచ్చే దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే రజనీ, కార్తీక్ ల సినిమా సెట్స్ పైకి పోయే అవకాశం ఉంది..
వర్మను కలిసిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ!
ప్రియాంకపై కన్నేసిన సలార్ డైరెక్టర్!