ప్లీజ్ ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు : రజినీకాంత్

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ తంబీలకు ఆరాద్యదైవం అంటే అతిశయోక్తి లేదు. మాస్ హీరోగా తమ గుండెల్లో పెట్టుకున్నారు.. అయితే కొంత కాలంగా తమ ఆరాద్య దైవం రాజకీయాల్లోకి వచ్చి తమ జీవితాలు మారుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రజినీ అభిమానులు. అందుకు తగ్గట్టు కొంత కాలంగా రజినీకాంత్ కూడా కొత్త పార్టీ పెడతామని ఊరిస్తూ వచ్చాడు.

కానీ ఇటీవల తాను రాజకీయ పార్టీ పెట్టబోనని.. తాను రాజకీయాల్లోకి రానని చావు కబురు చల్లగా చెప్పాడు. అంతే ఒక్కసారే అభిమానుల గుండెలు పగిలిపోయాయి.. నిరాశతో బాధపడ్డారు. కానీ ఎక్కడో అక్కడ రజినీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో రాజకీయాల్లోకి రావాలని సందడి చేస్తూ ఉన్నారు.

- Advertisement -

తాజాగా మరోసారి రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకు మరోసారి స్ఫష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానని, ఇబ్బందిపెట్టోదని కోరారు. గతంలోనే రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పినట్లు గుర్తుచేశారు. తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దంటూ స్పష్టం చేశారు. రజినీకాంత్ తన విజ్ఞప్తిని లేఖ రూపంలో ట్విట్టర్‌ ద్వారా సోమవారం విడుదల చేశారు‌.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...