Thursday, April 25, 2024
- Advertisement -

శంకర్​ సినిమాలో చెర్రీ డ్యుయల్​ రోల్​ ?

- Advertisement -

తమిళ దర్శకుడు శంకర్​, మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్​ తేజ్​ సినిమా వస్తుందని అధికారిక ప్రకటన రాగానే.. సినీ ఇండస్ట్రీలో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమాలో కథ ఏమిటి? మ్యూజిక్​ ఎవరు? షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నది తదితర విషయాలపై ఆసక్తి నెలకొన్నది. శంకర్​ చిత్రాలన్నింటిలోనూ ఏదో ఒక సామాజిక అంశం ఉంటుంది. ఇక హీరోలను ఓ రేంజ్​లో ఎలివేట్ చేయడం శంకర్​ స్టయిల్​.

ఆయన గత చిత్రాలు ఒకేఒక్కడు, జెంటిల్​మెన్​, అపరిచితుడు, ప్రేమికుడు, రోబో తెలుగులోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. దీంతో శంకర్​ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే తెలుగులో సైతం మార్కెట్​ ఉంటుంది. అయితే ఈ సారి రామ్​చరణ్​ కాంబినేషన్​లో సినిమా అనగానే అంచనాలు మరింత పెరిగాయి. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు టాక్​.

Also Read: రామ్ తో ఢీ అంటే ఢీ అంటున్న ఆది పినిశెట్టి..!

ఈ సినిమాకు సాయిమాధవ్​ బుర్రా మాటలు సమకూరుస్తున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్​ బ్యానర్​పై దిల్​ రాజు, శిరీష్​ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్​ చరణ్​ డ్యుయల్​​ రోల్​ ప్లే చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో నాయక్​ సినిమాలో చెర్రీ డ్యుయల్​​ రోల్​ ప్లే చేశాడు. ఆ మూవీ సక్సెస్​ అయ్యింది. ప్రస్తుతం మరోసారి చరణ్​ డ్యుయల్​​ రోల్​లో కనిపించబోతున్నాడన్నమాట.

Also Read: డైరెక్టర్ గా స్టార్ కమెడియన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -