హీరో సిద్ధార్థ్​ చనిపోయాడు.. యూట్యూబ్​ చానల్​లో వీడియో? రచ్చ రచ్చ

- Advertisement -

కొన్ని యూట్యూబ్​ చానల్స్​ ఎంతగా దిగజారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కథనాలు ప్రసారం చేస్తూ.. వారి ప్రతిష్ఠను దిగజార్చేలా థంబ్​నెయిల్స్​ పెడుతుంటాయి. కేవలం వ్యూస్​ కోసం పెట్టుకొనే కొన్ని యూట్యూబ్ చానల్స్​ ఎటువంటి జర్నలిజం విలువలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం ఓ యూట్యూబ్​ చానల్​ చిన్న వయసులో చనిపోయిన సౌత్​ ఇండియన్ స్టార్ వీళ్లే అంటూ ఓ కథనం ప్రసారం చేసింది.

ఇందులో ఆర్తీ అగర్వాల్​, సౌందర్య వంటి హీరోయిన్స్​ చనిపోయారంటూ చెప్పారు. అంతేకాక హీరో సిద్ధార్థ్​ను కూడా చనిపోయిన వాళ్ల లిస్ట్​లో కలిపేశారు. సిద్ధార్థ్​ తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మరిల్లు వంటి సక్సెస్​ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆట, చుక్కల్లో చంద్రుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తదితర సినిమాల్లో నటించాడు. అయితే ఇక్కడ సక్సెస్​ రేట్ పడిపోవడంతో ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఆర్​ఎక్స్​ 100 ఫేమ్​ అజయ్​ భూపతి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మహాసముద్రం సినిమాలో హీరోగా సిద్ధార్థ్​ ఎంపికయ్యాడు. ఇందులో మరో హీరోగా శర్వానంద్​ నటిస్తున్నాడు.

- Advertisement -

Also Read:బజరంగీ బాయ్​జాన్​ 2 వచ్చేస్తోందా?

ఇదిలా ఉంటే సిద్ధార్థ్​ చనిపోయాడంటూ యూట్యూబ్​లో ప్రస్తుతం ఓ వీడియో ట్రెండ్​ అవుతోంది. ఈ వీడియో థంబ్​నెయిల్​లను స్క్రీన్​షాట్​ తీసి ఓ ఇన్​స్టాపేజ్​లో పెట్టారు. ఈ పిక్​ను ఓ అభిమాని సిద్ధార్థ్​ కు పంపించాడు. దీనిపై సిద్ధార్థ్​ స్పందిస్తూ.. ‘నిజానికి ఇది చాలా పాత వీడియో. గతంలోనే ఈ వీడియోకు నేను రిపోర్ట్​ కొట్టాను. కానీ సదరు యూట్యూబ్​ చానల్​ వాళ్లు నాకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు’ అంటూ రిప్లూ ఇచ్చాడు సిద్దూ. తాజాగా యూట్యూబ్​ చానల్స్​పై ప్రముఖ నటుడు నారాయణమూర్తి సైతం ఫైర్​ అయ్యారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ కొన్ని చానల్స్​ ప్రసారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నాడు.

Also Read: ట్విట్టర్​లో సౌత్ లోనే నంబర్​ 1 ప్లేస్ కి స్టార్ హీరో..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -