‘బెంగాల్ టైగర్’ చిత్రం తర్వాత రవితేజ ఇంకో సినిమా చేయలేదు. మధ్యలో దిల్ రాజ్ నిర్మాణంలో ఓ సినిమా మొదలు అయిన అది మధ్యలో అగిపోయింది. రీసెంట్ గా రవితేజకి పవర్ లాంటి హిట్ సినిమాని ఇచ్చిన బాబీకే మళ్లీ చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటివలే బాబీ చెప్పిన స్టోరికి రవితేజ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వెంకీ, బలుపు, కృష్ణ, పవర్ వంటి చిత్రాలతో రవితేజ కెరీర్ లో హిట్స్ రావడానికి కారణమైన కోన వెంకట్ కూడా రవితేజకు కథ చెప్పాడట. బాబీ చేప్పిన స్టోరీతో సినిమా చేయాలనుకున్న మాట నిజమే కానీ.. తరువాత కోన చెప్పిన కథ ఇంకా బాగా నచ్చడంతో ఆ స్టోరీతోనే సినిమా చేయాలనుకుంటున్నాడు. దీంతో బాబీ, కోనతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు.
‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సమయంలో పవన్, బాబీకు ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి మొత్తం అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి బాబీకు తలపోటు తెప్పించాడు. ఇప్పూడు రవితేజ కూడా అలానే చేస్తున్నాడనేది ఫిల్మ్ నగర్ గానం. మరి ఈ చిత్రం రవితేజకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి!
Related