ఇటివలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరో హీరో ఫ్యాన్ మధ్య జరిగిన గొడవలో పవన్ కళ్యాణ్ అభిమానిని మరో హీరో అభిమాని చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిడంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ చెవిన పడింది. విషయం తెలుసుకున్న పవన్ వెంటనే అభిమాని కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు తిరుపతి వెళుతున్నారు.
పవన్ కు వినోద్ రాయల్ అనే వ్యక్తి వీరాభిమాని. అలాగే జనసేన రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత అందులో కూడా చాలా చురుకుగా పాల్గొనేవాడు వినోద్. అయితే ఓ కార్యక్రమం కోసం వినోద్ మరో హీరో అభిమానితో కలిసి కర్ణాటక కు వెళ్లాడు.
అయితే అక్కడ మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అంటూ వాదులాట జరగడం ఆ గొడవ కాస్త ముదిరి చంపుకునేంత వరకు వెళ్ళడం తో పవన్ వీరాభిమాని వినోద్ రాయల్ చనిపోయాడు. కాగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పవన్ ఈరోజు తిరుపతి వెళుతున్నాడు.
{youtube}v=s16Yx8YGcMw{/youtube}
Related
