‘మా’ పెట్టిన చిచ్చు.. చిరు వర్సెస్​ మోహన్​బాబు

- Advertisement -

‘మా’ ఎన్నికలు తెలుగు సినిపరిశ్రమలో చిచ్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాగబాబు వర్సెస్​ మా అధ్యక్షుడు నరేశ్​ మధ్య జరిగిన మాటల యుద్ధం చూశాం. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సారి ప్రకాశ్​రాజ్​, మంచు విష్ణు బరిలో నిలిచారు. జీవితా రాజశేఖర్​, హేమ, నటుడు నరసింహరావు కూడా పోటీలో ఉండబోతున్నా.. ప్రధాన పోటీ మాత్రం ప్రకాశ్​రాజ్​, మంచు విష్ణు మధ్యే కేంద్రీకృతమైంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి హవా ఎక్కువ. సహజంగానే ఆయన మద్దతు ఇచ్చిన ప్యానెల్​ గెలుపొందుతూ వస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ప్రకాశ్​రాజ్​కు మద్దతు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ సభ్యులను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

ఇక నాగబాబు సైతం ప్రకాష్ రాజ్ కి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నిజానికి మా అధ్యక్షుడు అంటే పెద్దగా అధికారాలూ ఏమీ ఉండవు. కేవలం 900 మంది సభ్యులు పాల్గొనే ఓ ఎన్నిక. కానీ పోటీలో ఉండేది సినీ సెలబ్రిటీలు కాబట్టి సహజంగానే దాని మీద మీడియా ఫోకస్​ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నికలకు నోటిఫికేషన్​ రాకపోయినా అప్పుడే హడావుడి మొదలైంది. ఈ క్రమంలో చిరంజీవికి మోహన్​బాబుకు మధ్య చిచ్చు రాజుకున్నదన్న వార్తలు వస్తున్నాయి.

సహజంగానే సినీ పరిశ్రమలో సైతం కులాల కుమ్ములాట ఉంటుంది. ప్రస్తుతం రెండు కులాల మధ్య పోటీలాగా కూడా చూపిస్తున్నారు. గతంలో చిరంజీవి, మోహన్​బాబు మధ్య కోల్డ్​వార్​ సాగేది. పలు వేదికల మీద మోహన్​బాబు.. చిరంజీవిపై తన అక్కసును వెల్లగక్కాడు. చిరంజీవి మాత్రం చాలా సందర్భాల్లో లౌక్యంగానే వ్యవహరిస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మా ఎన్నికల పుణ్యమా అని వీరిద్దరి మధ్య మరోసారి చిచ్చు రాజుకున్నది. ఇప్పటికే ప్రతిరోజు టీవీ డిబేట్లలో మా ఎన్నికల అంశమే ప్రధాన అజెండాగా మారిపోయింది. ఇక పత్రికా సమావేశాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మా ఎన్నికలు రాజకీయ వేడిని పులుముకున్నాయి. ఇంకా ఏమేం జరుగుతుందో వేచి చూడాలి.

Also Read

సోషల్​ మీడియాకు గుడ్​బై చెప్పిన ప్రముఖ దర్శకుడు..!

ఇంతకీ పవన్ సినిమాలో హీరోయిన్ ఎవరూ? 

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -