పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి సినిమాలకు దూరమై చాలా కాలమే అయ్యింది. పిల్లలు, పర్సనల్ లైఫ్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. త్వరలో రేణు దేశాయి మళ్లీ తెరపై కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదీ ఓ కీలక పాత్ర చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్
నాగేశ్వరరావు. స్టువర్ట్ పురం దొంగ బయోపిక్. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో రవితేజ సోదరి పాత్రలో రేణు కనిపించనున్నారని తాజా సమాచారం.
ఇప్పటికే ఆ పాత్ర గురించి రేణుతో చర్చలు కూడా జరిపారట. త్వరలో దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా ‘జానీ. మరోవైపు ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ చిత్రంతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ప్రస్తుతం ‘ధమాకా’, ‘రామారావు ఆన్‌డ్యూటీ’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఒకే సారి 20 వేల థియేటర్లలో ఆదిపురుష్