Monday, May 13, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..! సినిమా అప్పుడే..!

- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి, రామ్ చరణ్, రామరావుల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. బాహుబలి తర్వాత ఆ రెంజ్ సినిమానే మళ్లీ తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్.. దసరా కానుకగా ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలయ్యింది. ఈ రెండు టీజర్లకు మంచి స్పందన వచ్చింది.

ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రాం చరణ్.. కొమరం భీం గా ఎన్టీఆర్ లు పోరాట యోధులుగా చూపిస్తున్నారు రాజమౌళి. ఈ భారి బడ్జెట్ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా, బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ ఎన్టీఆర్ కి జంటగా నటిస్తున్న సంగతి తెల్సిందే. అలాగే అజయ్ దేవగన్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాదు సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న చిత్రబృందం.

రీసెంట్ గా లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వెంటనే మహబళేశ్వరం లో మొదలు పెట్టారు. అయితే రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతుంది. కొత్త సంవత్సరం జనవరి 1న ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను కొత్త సంవత్సరంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు రాజమౌళి ఫ్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఇంత మంది హీరోల్లో చరణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోల కూతుర్లు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -