Thursday, March 28, 2024
- Advertisement -

టీకా వేయించుకున్న హర్యానా హోం మంత్రికి కరోనా పాజిటీవ్..

- Advertisement -

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఎన్నో బాధలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలు మొత్తం ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనే విషయంలో తెగ కష్టపడుతున్నారు. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ వచ్చిందని.. పలువురిపై ప్రయోగాలు కూడా చేస్తున్నామని పలు దేశాలు చెబుతున్నారు. తాజాగా హరియాణా హోంశాఖమంత్రి అనిల్ విజ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.

అనిల్ విజ్ ఒక ట్వీట్‌లో తనకు కోవిడ్-19 టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా గత నవంబరు 20న దేశీయ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్‌లో అనిల్ విజ్ టీకా తీసుకున్నారు. ఆయన అంబాలా కెంట్‌లోని ఆసుప్రతిలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.

పీజీఐ రోహతక్ బృందం పర్యవేక్షణలో అనిల్ విజ్‌కు టీకా వేయడం జరిగింది. టీకా తీసుకున్న అనంతరం 30 నిముషాల పాటు అనిల్‌విజ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దేశీయ టీకా కోవాక్సిన్ మూడవ దశలో మొత్తం 200 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. ఇప్పుడు వారిలో యాంటీబాడీ అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నారు. టీకా తీసుకున్నప్పటికీ హోం మంత్రికి కరోనా పాజిటీవ్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -