Saturday, May 18, 2024
- Advertisement -

సమంత రిసెప్షన్ ఆ రెస్టారెంట్‍లోనట!

- Advertisement -
Samantha Reveals her Engagement Venue

ఏదో ఒక విధంగా వార్తల్లో గత కొద్దిరోజలుగా కనిపిస్తున్న ముద్దుగుమ్మ సమంత. తన సినిమాలతోనో… తన లవ్ ఎఫైర్ తోనో ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఎక్కడికైనా వెళితే.. ప్రశ్నలతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే మీడియా ప్రతినిధులకు తన మాటలతో అప్పుడప్పుడు షాకిచ్చే స్పెషాలిటీ సమంత సొంతం.

అమ్మడు తాజాగా ఒక  రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఇంతకీ అది ఎవరిదో కాదు.. ఆమెకు చాలా క్లోజ్ ప్రెండ్ అయిన డిజైనర్ కోన నీరజ.. సినీ హీరో నితిన్ ఇద్దరూ కలిసి పెట్టిన జాయింట్ వెంచర్. టీ గ్రిల్ రెస్టారెంట్ పేరిట స్టార్ట్ చేసేందుకు రెస్టారెంట్ కు వచ్చిన సమంత.. తనకు తెలంగాణ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అంతేనా తనకు వంట రాదని.. కానీ చేసిన వంట టేస్ట్ చెప్పటంతో తనకు తానే సూపర్ అని చెప్పేసింది. ఇలాంటి ముద్దు ముద్దు మాటలు హీరోయిన్ల నోటి నుంచి మామూలే కాబట్టి లైట్ తీసేసుకోవచ్చు.

మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసిన తర్వాత.. అరే.. పెళ్లి గురించి అడుగుతారని అనుకున్నానే ఇంకా అడగలేదని అనుకుంటున్నానే అంటూ స్వీట్ కౌంటర్ వేసేసిన ఆమె.. తన పెళ్లి గురించి అందరికి చెబుతానన్నారు. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడా అన్న విషయాన్ని చెప్పని సమంత.. తన రిసెప్షన్ మాత్రం ఈ రెస్టారెంట్ లోనే పెడతానని చెప్పేసింది. మొత్తానికి పెళ్లి వెన్యూ డిసైడ్ కాకున్నా.. సమంత రిసెప్షన్ వెన్యూ మాత్రం డిసైడ్ అయినట్లేనన్న మాట.

Related

  1. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!
  2. సమంత, సిద్దార్ధ బ్రేకప్ కథ!
  3. సమంత ప్రేమమ్ లో ఎందుకు నటించలేదంటే?
  4. చైతూ ని చీట్ చేసిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -