Sunday, May 19, 2024
- Advertisement -

నీకు పిచ్చి.. నీ మొగుడు పిచ్చి.. సుమపై ఫైర్ అయిన మహిళ

- Advertisement -
shaking show episode participant argues

మార్చి 31న ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రాం.. అందులో నాగబాబు, రోజా.. సుడిగాలి సుధీర్ టీమ్‌ను తిట్టిన.. తర్వాత అంత ఏప్రిల్ ఫూల్ అని తెలిసింది. అయితే ఈ విషయంపై జనాలు తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రెటింగ్‍ల కోసం ఇలాంటివి చేస్తారా అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు స్టార్ మహిళ అనే ప్రోగ్రాం మరో వివాదంలో పడింది.

రచ్చబండ అయినా, గడసరి అత్త సొగసరి కోడలు, ఢీ, జోడీ వంటి ఏ షో తీసుకున్నా ఏవీ లైవ్ షోలు కాదనే సంగతి అందరికి తెలిసిందే. ఏ స్కిట్ అయినా, డాన్స్ అయినా, జడ్జీలు.. ఏదైనా.. ప్రత్యక్ష ప్రసారం అయ్యే చాన్స్ లేదు. వాటికీ కట్‌లు, రీటేక్‌లు, టచప్‌లు ఎలాగూ ఉంటాయి. కానీ టీఆర్పీల మోజులో పడిన టీవీ ప్రొడ్యూసర్లు, యాజమాన్యం జనాల్లో క్రేజ్‌ను సంపాదించుకునేందుకు, లేనిపోని వివాదాలు ఏవో సృష్టించి, వాటిని టెలికాస్ట్ చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. తాజాగా స్టార్ మహిళ షోలో యాంకర్ సుమపై షోలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళ రెచ్చిపోయింది. తను చెప్పిన జవాబు కరెక్ట్ అనివాదనకు దిగి.. నీకేమైనా పిచ్చా అని సుమ అనడంతో మరింత రెచ్చిపోయిన ఆమె నీకు పిచ్చి, నీ మొగుడు రాజీవ్ కనకాలకు పిచ్చి అనే రేంజికి వెళ్లిపోయింది.

పార్టిసిపెంట్ ఎలా ఉండాలో తెలుసుకోమని సుమ అంటే.. యాంకర్ ఎలా ఉండాలో నువ్ తెలుసుకో అని సుమకు గట్టి రిటార్ట్ ఇచ్చింది ఆమె. మాటకు మాట ఎదురయ్యేసరికి సహనం కోల్పోయిన సుమ గెటౌట్ ఆఫ్ మై షో అనేసింది.. కానీ ఈ మొత్తం వివాదానికి కారణమైన ఆ పార్టిసిపెంట్ చిరునవ్వులు చిందించడంతోనే ఈ ప్రోమో చూసేవారందరికీ డౌట్ వచ్చేసింది. ఇది మరో పబ్లిసిటీ స్టంటే ఏమోనని. అడల్ట్ కామెడీకి, ద్వందార్థాల సంభాషణలకు పాపులర్ అయిన జబర్దస్త్‌లో ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడుకున్నా, సుమ వంటి ఎంతో ప్రతిభాపాటవాలు ఉన్న యాంకర్‌కు సైతం ఈ వివాదాల పబ్లిసిటీ ఎందుకంటూ టీవీజనులు చర్చించుకుంటున్నారు. చూద్దాం.. త్వరలోనే ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఈ సస్పెన్స్‌కు తెరపడిపోతుంది.

{youtube}Vt_uCAAm750{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రాజకీయాలపై సూపర్ పంచ్ వేసిన సుమ
  2. యాంకర్ సుమ వయసు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
  3. యాంకర్ సుమ ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్
  4. సుమంత్ కి విడాకులిచ్చిన కీర్తి రెడ్డి ఎవర్ని చేసుకుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -