Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి షాకింగ్ నిజాలు చెప్పిన శృతీహాసన్‌!

- Advertisement -

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ హీరోలంద‌రిలోకి న‌ట‌న ప‌రంగా చూస్తే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మేటి అని చెప్పొచ్చు. ఓ చిత్రం హిట్, ప్లాప్ అనే విషయం పక్కనపెడితే నటన పరంగా 100 శాతం న్యాయం చేస్తాడు యంగ్‌టైగ‌ర్. అందుకే ఎన్టీఆర్ కు ఈ రెంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయిన ఒదిగిపోవ‌డం, లీన‌మ‌వడం ఎన్టీఆర్ ప్రత్యేకత. అయితే ఎన్టీఆర్ స్థాయిలో నటించగలిగిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు అనే విష‌యం నిజం అనడానికి ఓ సంఘ‌ట‌న నిద‌ర్శ‌నంగా మారింది.

ఎన్టీఆర్ యాక్టింగ్ కమల్ హాసన్‌కి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట. కొంత కాలంగా ఆసుప‌త్రిలో ఉంటూ బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కమల్ హాసన్ రీసెంట్‌గానే డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి తన హోం థియటర్‌లో వరుసగా సినిమాలు చూస్తూ ఉన్నాడట.  తాజాగా ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాను శృతీహాసన్‌తో కలిసి చూశాడట. ఓ స్టార్ హీరో పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం కమల్‌కి చాలా చాలా నచ్చేసిందట. ఎమోషనల్ సీన్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్‌కి ఫిదా అయిన కమల్ ఈ విషయాన్ని కుమార్తె శృతీతో షేర్ చేసుకున్నాడట.

అందుకే వెంటనే తార‌క్‌కి ఫోన్ చేసి తార‌క్ న‌ట‌న‌ను త‌న నాన్న క‌మ‌ల్ ఏ రేంజ్‌లో ప్రశంసించాడో వివ‌రించింద‌ట‌. ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, మీడియా వర్గాల్లోనూ క‌మ‌ల్ ప్ర‌శంస‌లు హాట్ టాపిక్ అయింది. క్లాసికల్ డ్యాన్సర్, అమేజింగ్ యాక్టర్ అయిన తార‌క్‌ ప్ర‌తిభ‌ కమల్‌కి నచ్చిందంటే అందులో ఆశ్ఛర్యపోవాల్సిందేముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో.. తార‌క్ ల‌క్కీ అనే చెప్పాలి. న‌ట‌న‌కు మారుపేరుగా నిలిచిన క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌శంస‌లు పొంద‌డం అదృష్ట‌మే క‌దా.. !

Related

  1. ఎన్టీఆర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
  2. బాహుబలి-3 లో రాజుగా ఎన్టీఆర్!
  3. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది
  4. శృతీహాస‌న్‌ రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -