తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్న సింగర్ సుచిత్ర ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది. అది కూడా స్టార్ హీరో మీద.. విషయంలోకి వెళ్తే.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మరియు ఆయన టీం తనపై దాడి చేశారు అంటూ ట్విట్టర్ ద్వారా వెళ్లడి చేసి అందరికి షాక్ ఇచ్చింది సింగర్ సుచిత్ర. అందుకు సాక్ష్యంగా ఒక ఫొటోను కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీంతో కోలీవుడ్ లో ధనుష్‌పై విమర్శలు ఘోరంగా చేస్తున్నారు.
ఈ టైంలో ఆమె మీడియాకు అందుబాటులో లేకుండా పోయింది. మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్తే బాగుంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. హీరో ధనుష్‌తో పాటు తమిళనాట ప్రముఖ వ్యక్తి అయిన సద్గురు జగ్గి వాసుదేవ్‌పై కూడా సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. వీరిద్దరు తనను తీవ్రంగా గాయపర్చారు అంటూ ఆమె పేర్కొంది. ఇటీవల కేరళలో హీరోయిన్ భావనకు జరిగినట్లుగానే తనకు జరిగిందని ఆమె ఆవేధన వ్యక్తం చేస్తుంది.
భావనపై అత్యాచార యత్నం జరిగిన విషయం తెల్సిందే. అంటే ఈమెపై కూడా హీరో ధనుష్ మరియు జగ్గి వాసుదేవ్‌లు అత్యాచార యత్నం చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి కోలీవుడ్ లో సుచిత్ర చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరో వైపు సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, అపరిచితులు ఎవరో ఆమె పేరుతో ట్వీట్స్ చేశారు అంటూ ఆమె తరపు వారు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ధనుష్ లేదా సుచిత్ర మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిందే.
{youtube}eqiaI697IQQ{/youtube}
Related