ఇప్పుడు సినిమాలో అవకాశాలు రావాలంటే.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయాలి. ఒకప్పుడు మాటలను తూటాలా పేల్చితే సరిపోయేది.. కానీ.. ఇప్పుడు మాత్రం అల కుదరడం లేదు. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ బికినీల్లో రచ్చ చేస్తేనే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. మంజరి ఫద్నిస్ నుండి త్రిధా చౌదరి వరకు.. నియా శర్మ నుండి సీరత్ కపూర్ వరకు.. అందరూ ఇలా తమ టైమ్ లైన్స్ లో బికినీ ఫోటోలు పెట్టాకనే.. ఆఫర్లు పెరిగిపోయాయ్.
ఈ విషయంను కాస్త ఆలస్యంగా తెలుసుకుంది బ్యూటి స్నేహ ఉల్లాల్. అప్పుడెప్పుడో వచ్చిన ఒక హిట్.. ఆ తరువాత హాటుగా కనిపిస్తూ చేసిన కొన్న ఫీట్లు.. కొన్ని వీడియోలు.. ఏవీ అమ్మడికి కాసింత కూడా ఫేమ్ తీసుకురాలేకపోయాయి. ఫేమ్ సంగతి పక్కన పెడితే.. ఆఫర్లు కూడా లేకుండా పోయాయి. అందుకే ఇప్పుడు లాభం లేదని అనుకుందేమో తెలియదు కాని.. వెంటనే అమ్మడు బికినీల్లో దిగిపోయింది.
ఈ ఆ ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది. పింక్ రంగు సింగిల్ పీస్ బికినీలో.. కాస్త భయపడుతూ.. బెరుకుబెరుకుగా తన అందాలను ఆరబోస్తోంది స్నేహ ఉల్లాల్. ఆ విధంగా నేను సమ్మర్ లో సేద తీరుతున్నా అన్నట్లు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందిలే. మరి ఈ బికినీ దెబ్బకు ఈ అమ్మడికి ఛాన్సులు వస్తాయోమో చూడాలి.
Related
