Tuesday, May 14, 2024
- Advertisement -

ర‌స‌వ‌త్త‌రంగా మారిన బెజ‌వాడ రాజ‌కీయాలు

- Advertisement -
Why Lagadapati Rajagopal Meets AP CM Chandrababu

బెజ‌వాడ రాజ‌కీయాల‌లో అనుకోని ప‌రినామాలు చోటు చేసుకుంటున్నాయి. ల‌గ‌డ పాటి రాజ‌గోపాల్ నిన్న చంద్ర‌బాబుతో భేటీ అవ‌డంతో రాజ‌కీయాలు వ‌స‌వ‌త్త‌రంగా మారాయి.  ల‌డ‌పాటితో దాదాపు 40 నిమిషాల‌పాటు  ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు గతంలో ప్రతినబూనిన లగడపాటి… ఏకంగా చంద్రబాబుతో సచివాలయంలోనే సమావేశం కావడం టీడీపీ వర్గాల్లో  తీవ్ర చర్చకు దారి తీసింది.ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అసంతృప్తి సెగ‌లు ఇప్పుడ తారాస్తాయికి చేరిన‌ట్లు స‌మాచారం.

మంత్రి వ‌ర్గ‌విస్త‌ర‌ణ‌తో  ఎలాంటి అసంతృప్తి బ‌య‌ట‌ప‌డిందో అంద‌రికీ తెలిసిందే.   మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా… ముఖ్యమంత్రి వైఖరిపై  బ‌హిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు.  ఇక ఎంసీ కేశినేని విష‌యంలో కూడా చంద్ర‌బాబు పూర్తి అసంతృప్తితో ఉన్నారు.ఆర్టీఏ కార్యాలయం వివాదంతో  ఎంపీ కేశినేని నానీకి… ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో  పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని నానికి చెక్‌ పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికలకు విజయవాడ ఎంపీ సీటు లగడపాటికి కేటాయించబోతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ భేటీపై ఇప్పటికే టీడీపీ వర్గాలు ఆరా తీయడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే…ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రహ్మాణికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.  

మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం రాత్రి వెలగపూడిలో సీఎంను కలవడం…. బెజవాడ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. తాజా పరిణామాల నేపథ‍్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు, ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంతవరకూ వాడుకుని, ఆ తర్వాత కూరలో కర్వేపాకులాగా వాడుకున్నార‌నీ నాని ఆవేద‌న వ్య‌క్తంచేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  దీంతో తనకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. విజ‌య‌వాడ టికెట్‌హామీని  లగడపాటి రాజగోపాల్‌కు సీఎం ఇచ్చిన‌ట్లు  గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related

  1. ప్ర‌త్యేక హోదాపై టీడీపీ ఎంపీల తీరుపై ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ణ్ స్పంద‌న‌
  2. మ‌రో అణు యుధ్దం తప్ప‌దా… అమెరికాకు ర‌ష్యా,ఇరాన్ వార్నింగ్‌…..
  3. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌ద‌రంగంలో అఖిల ప్రియ పావేనా?
  4. మ‌రో అణు యుధ్దం తప్ప‌దా… అమెరికాకు ర‌ష్యా,ఇరాన్ వార్నింగ్‌…..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -