Friday, May 17, 2024
- Advertisement -

పెళ్లిళ్ల విషయంలో షాకింగ్ ట్విస్టులు ఇస్తున్న నాగార్జున

- Advertisement -
change of marriage plans in akkineni family

అక్కినేని హీరోలు రియల్ లైఫ్ లోను ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. కింగ్ నాగర్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి విషయం పక్కన పెట్టి.. చిన్న కొడుకు అయిన అఖిల్ కి ఈ నెల డిసెంబర్ 9 న నిశ్చితార్థం చేసి ఫస్ట్ షాక్ ఇచ్చారు. ఇలా ఎందుకు చేసారు అంటే.. చైతూకి కొంత టైమ్ కావాలంటా.. అంటూ సర్ది చెప్పారు. ముందు అఖిల్ పెళ్లి చేసాక నాగ చైతన్య పెళ్లి చేస్తానని వివరించారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

చైతు, సమంతల నిశ్చితార్థం జనవరి 29న చేయబోతున్నట్లు ప్రకటించారు. అందరికీ చెప్పని మరో షాకింగ్ విషయం ఏమిటంటే అఖిల్ కంటే చైతు పెళ్లి ముందు జరుగుతుందంట. ఎందుకిలా చేస్తున్నారు అని అరా తీస్తే అసలు సంగతి బయటకు వచ్చింది. ఇంట్లో అన్న కంటే ముందు తమ్ముడికి పెళ్లి చేయడం మంచిది కాదని పండితులు చెప్పడంతో వారి మాట ప్రకారమే.. ముందు చైతు పెళ్లి చేయాలనీ నాగ్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

అఖిల్, శ్రీయా భూపాల్ వివాహం ఇటలీలో ప్లాన్ చేస్తుండగా.. చైతు, సమంతల పెళ్లి హైదరాబాద్ లోనే వైభవంగా చేయడానికి అక్కినేని కుటుంబం ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నాగర్జున తమ కొడుకుల పెళ్లిళ్ల డేట్ లను వెల్లడించనున్నారు. సినిమాల్లో ఉహించని ట్విస్టులతో అలరించే అక్కినేని హీరోలు నిజ జీవితంలో కూడా ఫ్యాన్స్ కి ట్విస్టులు ఇస్తున్నారు.

Related

  1. నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చాడంటే?
  2. నాగార్జున- ట‌బూ మధ్య ఉన్న బంధం ఇదే!
  3. నాగర్జునకి తలనొప్పిగా మారిన సమంత?
  4. సమంతకు నాగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -