Tuesday, April 23, 2024
- Advertisement -

చిన్న సినిమాలు బతకాలి.. పెద్ద సినిమాలు ఆడాలి

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల పెంపునకు నిరాకరించడంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్, నాని లాంటి వాళ్లు మాట్లాడిన మాటలు ఇటీవల వివాదాస్పదంగా నూ మారాయి. తాజాగా సినిమా టికెట్ ధరలపై మంచు మోహన్ బాబు స్పందించారు.

రూ. 300, రూ.350 టికెట్ ధర నిర్ణయిస్తే చిన్న సినిమాలు ఎవరూ చూడరని అలాగే 30, 50 రూపాయలుగా టికెట్ ధరను నిర్ణయిస్తే పెద్ద సినిమాలకు గిట్టుబాటు కాదని అన్నారు. చిన్న సినిమాలు బతకాలి. అలాగే పెద్ద సినిమాలు ఆడాలని అన్నారు. అందుకు సినీ రంగంలోని పెద్దలు చొరవతీసుకోవాలని చెప్పారు.

నేడు సినీ రంగం అంటే కేవలం నలుగురు పెద్ద హీరోలు, నలుగురు దర్శకులు, ముగ్గురు నిర్మాతలు అన్న చందంగా మారిందని విమర్శించారు. టికెట్ ధరల విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదని అన్నారు. ఈ నిర్మాతలు ముందుకు రావాలని చెప్పారు. సినీ రంగంలోని అందరు ఐక్యంగా ముందుకు వచ్చి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు.

పది గెటప్స్ లో మాస్ మహారాజ రవితేజ

బాలకష్ణ నెక్ట్స్‌ మూవీలో విలన్ గా స్టార్ హీరో

నేటి నుంచి పాఠశాలలు బంద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -