Friday, April 26, 2024
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం

- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్ లో చేదు అనుభవం ఎదురైయింది. ఈరోజు ఆయన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లగా చేదు అనుభవం ఎదురయ్యింది.
అయితే ప్రధాని మోదీకి కనీవినీ ఎరుగని భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా వేలాది మంది సాయుధబలగాలు ఆయనకు భద్రత కల్పిస్తుంటాయి. అయితే ఈరోజు ఆయన పంజాబ్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించింది.

పంజాబ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మార్గంలో నిరసనకారులు రోడ్డును నిర్బంధించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఫ్లైఓవర్ వరకు ప్రధాని కాన్వాయ్ చేరుకుంది. దీంతో మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ పై 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. అక్కడే ఉండిపోవాల్సివచ్చింది. 20 నిమిషాల తర్వతా మోదీ కాన్వాయ్ తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ లోని జాతీయ అమరవీరుల స్మారకం ఉన్న హుస్సేనివాలకు మోదీ వెళ్లాల్సి ఉంది. వాతావరణం సరిగా లేని కారణం వల్ల రోడ్డు మార్గం గుండా అక్కడకు వెళ్లేందుకు ప్లాన్ చెసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఫిరోజ్ పూర్ లో జరగాల్సిన ప్రధాని ర్యాలీ కూడా రద్దయింది. ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తు పంజాబ్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని ఆదేశించామని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

తెలంగాణలో విద్యా సంస్థలు బంద్

అనుకున్నదే జరిగింది రాధేశ్యామ్ వాయిదా

త్వరలోనే మీ ఇంటికి రాబోతున్న పుష్పరాజ్‌..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -