రకరకాల భార్యలు.. ఆర్జీవీ వెబ్​సీరిస్​

వివాదాస్పద దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ.. తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్​సీరిస్​ను తెరకెక్కించబోతున్నాడు. అదే ‘రకరకాల భార్యలు’ ఇందుకు సంబంధించి ఓ ప్రమోషనల్​ వీడియోను విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్​ అవుతోంది. ఆర్​జీవీ తెరకెక్కించిన సినిమాలు విజయం సాధించినా.. ఫెయిల్ అయినా.. రిలీజ్​కు ముందు కచ్చితంగా వివాదాస్పదం అవుతాయి. దాంతో ఆ సినిమాలకు కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతూ ఉంటుంది.

తాజాగా రకరకాల భార్యలు అంటూ ఓ వెబ్​సీరిస్​ను ప్లాన్​ చేశాడు ఆర్​జీవి. దీని ప్రమోషన్​లో వీడియోలో ఆర్​జీవీ మాట్లాడుతూ.. ‘భరతముని, కేశవదాసు, జయదేవుడు, వనమాలి లాంటి ఇంకా మహానుభావులు.. చాలా ఏళ్ల క్రితమే లోకంలో ఎన్ని రకాల స్త్రీలు ఉన్నారో వాళ్లను వివిధ పేర్లతో వర్గీకరించారు. కానీ అది తప్పు. స్త్రీల అసలు స్వరూపం వాళ్లు పెళ్లి చేసుకున్నాక బయటకొస్తుంది.

ప్రపంచంలో మొత్తం ఎనిమిది రకాల భార్యలు ఉంటారు. ఏడుపుగొట్టు భార్య, దెబ్బలాడే భార్య, స్మార్ట్​ ఫోన్​ పట్టుకుంటే వదలని భార్య, అనుమానపు పిశాచి, ముక్కుమీద కోపం, భర్తను తొక్కిఉండే భార్య, పిసినిగొట్టు, గొప్పలకు పోయే భార్యా ఇటువంటి భార్యలను ఈ వెబ్​సీరిస్​లో చూపించబోతున్నాము.ఒక్కో ఎపిసోడ్​లో ఒక్కో తరహా భార్యను చూపిస్తాము. ఇది సీజన్​ 1. ఇక సీజన్​ 2లో భర్తలను చూపించబోతున్నాము’ అంటూ ఆర్జీవీ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారింది. ఈ సిరీస్‌లో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య కీలకపాత్రలో కనిపించనున్నారు.

Also Read

ప్రభుత్వాలు అనుమతిచ్చినా.. సినిమాల విడుదలకు అడ్డేమిటి?

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

Also Watch

Related Articles

Most Populer

Recent Posts