- Advertisement -

అలా ఉండే భర్త కావాలంటున్న సురేఖా వాణి కూతురు..వైరల్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి,తన కూతురు సుప్రీత పేరు ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వీరు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.నలభై వయసు వచ్చినప్పటికీ సురేఖవాణి తన కూతురుతో కలిసి హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

తాజాగా సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో లైవ్లో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఫాలోవర్స్ అందరూ హాయ్ అని మెసేజ్ చేయగా బోర్ కొడుతుంది.. ఏవైనా ప్రశ్నలు అడగండి సమాధానం చెబుతానని సుప్రీత చెప్పగా.. నెటిజన్లు తమదైన శైలిలో వారికి తోచిన ప్రశ్నలను అడుగుతున్నారు.

Also read:సుడిగాలి సుధీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను.. ఏం చేశాడంటే?

ఇదివరకే సుప్రీత తన తండ్రి మరణం గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఓ నెటిజన్ బాయ్ ఫ్రెండ్స్, తన ప్రేమ, పెళ్లి గురించి పలు ప్రశ్నలు అడగగా అందుకు సుప్రీత స్పందిస్తూ తనకు కాబోయే వాడు ఏ విధంగా ఉండాలో తెలియజేశారు. ఈ విధంగా సుప్రీత తన పెళ్లి గురించి చెప్పిన సమాధానాలు ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పెళ్లి విషయంలో తనకు కాబోయే వాడి గురించి పెద్దగా కోరికలు ఏమీ లేవు కానీ తనను చేసుకోబోయే వాడు ఓవర్ థింకింగ్ చేయకూడదు. తన పిచ్చిని భరించే వాడైతే చాలు అంటూ తనకు కాబోయే రాకుమారుడి గురించి తెలిపారు. ఈ క్రమంలోనే మరో నెటిజెన్ పెళ్ళెప్పుడు అని అడగగా.. అందుకు సుప్రీత స్పందించి మరో మూడు సంవత్సరాల పాటు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని ఎంత సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

Also read:తండ్రి మరణ రహస్యం గురించి చెప్పిన సురేఖా వాణి కూతురు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -