Tuesday, May 7, 2024
- Advertisement -

మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం!

- Advertisement -

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ కరువై పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బెడ్స్ దొరికినా ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో దేశంలో ఇప్పటికే దాదాపు 19 రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ విధించగా, మరో 12 రాష్ట్రాలలో కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి. కనీసం కొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ పెడితే కరోనాను కట్టడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా లాక్‌డౌన్‌ పెట్టడానికి ఇష్టపడడం లేదంటూనే.. అది తప్ప వేరే ఆప్షనే లేదని వెల్లడించారు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గమన్నారు సూచించారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను మ‌రోమారు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖతో పాటు ఇత‌ర‌ మంత్రులు లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు అంటే మే చివరి వరకు పొడిగించాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు. పాలు, నిత్యావసరాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ కు ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. అయితే, వాటి అమ్మకాలు మాత్రం ఆంక్షలకు సడలింపులున్న సమయాల్లోనే చేయాలని సూచించారు.

అలా ఉండే భర్త కావాలంటున్న సురేఖా వాణి కూతురు..వైరల్!

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం!

కూకట్​పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -