సురేఖవాణి.. టాలీవుడ్‌కి పరిచయం అక్కర్లేని పేరు. హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగానో కనిపిస్తుంది. పాత్ర ఏదైనా తెరపై తన నటనతో రక్తికట్టించడంలో ఆమెకు ఆమే సాటి. కామెడీ పాత్రతైనా, ఎమోషనల్ పాత్రలైనా తనదైన నటనతో మెప్పించగలదు. అయితే తెరపై ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లో, చీరకట్టులో కనిపించే సురేఖ వాణి.. రియల్ లైఫ్‌లో మాత్రం ఎక్కువగా ట్రెడిషినల్ లుక్‌లోనే కనిపిస్తుంటారు.
ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. కూతురు సుప్రితతో కలిసి పొట్టి దుస్తులు వేస్తూ అందాలు ఆరబోస్తుంటారు. వీరిద్దరి ఫోటోలు వైరల్ అయి, చివరకు ట్రోల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిపై తల్లీ కూతురు ఘాటుగానే స్పందిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దీనిపై ఆమె కూతురు సుప్రిత ఓ రేంజ్‌లో మండిపడింది. వాస్తవాలు రాయండి.. కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై ఫైర్ అయింది.

సురేఖ వాణి సైతం రెండో పెళ్లి వార్తలను తీవ్రంగా ఖండించింది. తాజాగా సురేశ్ వాణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. అది ఎవరిని ఉద్దేశించి చేశారో కచ్చితంగా తెలియడం లేదు. కానీ సురేఖా వాణికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు ఆ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ‘నకిలీ మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా, సుఖంగా ఉంటుంది’అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
చిరు పొగడ్తలు.. సొట్ట బుగ్గల పిల్లకు హీరోయిన్ చాన్స్